Exam Results Date: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలు ముగిసిన వ్యాల్యుయేషన్ ప్రక్రియ నడుస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ విద్యార్ధులు ఫలితాల కోసం చూస్తున్నారు. గతంలో ఏయే పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యాయో ఓసారి చెక్ చేద్దాం.
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చ్ 18 వరకూ జరగనున్నాయి. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4తో ముగియనున్నాయి. గతంలో విడుదలైన ఫలితాల తేదీలను బట్టి చూస్తే ఈసారి సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు మే నెలలో విడుదల కావచ్చని అంచనా. గత ఏడాది సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షల ఫలితాలు మే 13న విడుదల కాగా 2023లో మే 12న విడుదలయ్యాయి. 2022లో జూలై 22న, 2021లో ఆగస్టు 3 న విడుదలయ్యాయి. ఈసారి మే నెలలో ఫలితాలు విడుదల కావచ్చని అంచనా ఉంది. ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in నుంచి తెలుసుకోవచ్చు.
ఇక ఐసీఎస్ఈ 10, 12 తరగతి పరీక్ష ఫలితాల కూడా మే నెలలో విడుదలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 18 నుంచి మార్చ్ 27 వరకు జరగగా, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 5తో ముగియనున్నాయి. గత ఏడాది ఈ ఫలితాలు మే 6న విడుదల కాగా అంతకంటే ముందు 2023లో మే 14న విడుదలయ్యాయి. ఈసారి మే రెండవ వారంలో ఫలితాలు వెలువడవచ్చు. ఈ ఫలితాలను www.cisce.org ద్వారా తెలుసుకోవచ్చు.
ఇక ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 1-15 తేదీల్లో విడుదల కావచ్చని అంచనా ఉంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తి కానుంది. ఆ తరువాత ఇతర ప్రక్రియలు పూర్తి చేసుకుని వాట్సప్ ద్వారా ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చ్ 1 నుంచి మార్చ్ 20 వరకూ జరిగాయి.
ఇక తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 25 వరకూ జరిగాయి. ప్రస్తుతం వ్యాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ నెలాఖరులో ఫలితాలు విడుదల చేయవచ్చని సమాచారం. గత ఏడాది ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న విడుదల కాగా 2023లో మే 9న విడుదలయ్యాయి.
Also read: AP 10th Exam Results: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలపై క్లారిటీ, ఎప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









