)
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా ఇది తుపాను రూపం దాల్చవచ్చని తెలుస్తోంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతం దిశగా కదులుతోందని ఐఎండీ వివరించింది. ఫలితంగా రానున్న రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి.
ఓ వైపు తుపాను ప్రభావం మరోవైపు నైరుతి రుతు పవనాల కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అటు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, బెంగళూరులో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. ఈ నెల 21 నాటికి సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 22వ తేదీన అల్పపీడనంగా మారనుంది. ఉత్తర దిశలో కదులుతున్నందున చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, ఉలుంతూర్ పేట, మైలాడుథురై ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండిగల్, ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో బారీ వర్షాలు పడనున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరువత్తూరు, వెల్లూరు, తిరువణ్ణామలై, సేలం, కరూర్, నామక్కల్, తిరుచురాపల్లి జిల్లాల్లో ఈ నెల 24 వరకు భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక ఏపీలో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. ఈ క్రమంలో ఏపీలోని ఈ జిల్లాలకు రానున్న 24 గంటలు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి