Women Dressing Style: అధికారంలో ఉన్నామనే సోయి లేదు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామనే తెలివి లేకుండా ఇష్టారీతిన నాయకులు వ్యాఖ్యలు చేస్తుండడంతో బీజేపీ ఇరకాటంలో పడుతోంది. తరచూ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుకుపడుతున్న బీజేపీ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మహిళల వస్త్రధారణపై ఓ రాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు అలా దుస్తులు వేసుకుంటే నచ్చదని.. అలాంటి వారికి తాను ఫొటోలు, సెల్ఫీలు ఇవ్వనని ప్రకటించారు. ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదం రేగింది.
Also Read: Harish Rao: పంచ పాండవులు ఎంత మంది అంటే రేవంత్ రెడ్డి డీఏలను చూపించాలి: హరీశ్ రావు
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన పర్యావరణ దినోత్సవ అవగాహన కార్యక్రమంలో అక్కడి బీజేపీ మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ హాజరై ప్రసంగించారు. 'మహిళలు పొట్టి దుస్తులు ధరించడాన్ని నేను సహించను. నాకు ఇష్టం లేదు. విదేశీ ఆచారమైన ఈ పద్ధతి భారత సంప్రదాయానికి పూర్తి విరుద్ధం' అని ప్రకటించారు. తాను మహిళలను దేవతారూపంగా చూస్తానని తెలిపారు.
'నిండైన వస్త్రాలతో సింగారించుకునే మహిళలు అందానికి ప్రతిరూపంగా చూస్తాం. విదేశాల్లో మహిళలు ఎంత తక్కువ దుస్తులు ధరిస్తే అంత అందమైనదిగా భావిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు' అని బీజేపీ మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ ప్రకటించారు. 'చాలాసార్లు నాతో సెల్ఫీలు దిగేందుకు అమ్మాయిలు వస్తారు. కానీ నేను నిండుగా వస్త్రాలు ధరించిన వారికి మాత్రమే ముందుగా సెల్ఫీలు ఇస్తుంటా. ఇదే విషయాన్ని వారికి చెబుతా' అని కైలాశ్ విజయ్ వర్గీయ వివరించారు. ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సోషల్‌మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. కాగా మంత్రి వ్యాఖ్యలను మహిళా సంఘాలతోపాటు కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు తప్పు బడుతున్నాయి.
? "I don’t like women in revealing dresses"
? "Girls in inappropriate clothes resemble Shurpanakha"
? "Chocolaty faces"These are all remarks by the same deplorable individual, @BJP4India leader and MP Cabinet Minister, Kailash Vijayvargiya. He repeatedly makes MISOGYNISTIC,… pic.twitter.com/JiXYfaXnz4
— All India Trinamool Congress (@AITCofficial) June 5, 2025
Also Read: Telangana Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు ఇవే..
బీజేపీ మంత్రులకు ఏమైంది? తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశ భద్రత విషయంలో.. సైనిక అధికారుల విషయంలో ఇటీవల బీజేపీ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే క్షమాపణలు చెప్పి వివాదానికి కొంత విరామం ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









