)
Festive Season Gift: దసరా, దీపావళి పండుగ ముందు తమకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. కేంద్రంతోపాటు కొన్ని మినహా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి బహుమతులు ప్రకటించడం లేదు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పింఛన్ పథకం నుంచి ఏకీకృత పింఛన్ పథకం (యూపీఎస్)లోకి మారేందుకు ఉన్న గడువును పొడిగింది.
ఉద్యోగులు యూపీఎస్‌ను ఎంచుకునేందుకు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న గడువు మంగళవారం (సెప్టెంబర్ 20)తో ముగిసింది. ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకం(ఎన్పీఎస్) నుంచి యూపీఎస్‌కు మారాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనకు స్పందన కరువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూపీఎస్ కింద అనేక సానుకూల మార్పులు ప్రకటించినట్లు ఆర్థిక శాఖ వివరించింది.
రాజీనామా ప్రయోజనాలు, కంపల్సరీ రిటైర్మెంట్, పన్ను మినహాయింపు వంటి లాభాలు జాతీయ పింఛన్ కింద ఉన్నాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. యూపీఎస్‌ను ఎంచుకోవడానికి.. దానిపై నిర్ణం తీసుకోవడానికి మరికొంత సమయం కావాలని ఉద్యోగులు చేసిన విజ్ఞప్తి మేరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. మరి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ నుంచి యూపీఎస్‌కు ఏ స్థాయిలో బదిలీ అవుతారో చూడాలి. యూపీఎస్ కన్నా ఎన్పీఎస్ ప్రయోజనంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తుండడంతో యూపీఎస్లోకి మార్చుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. పాత పింఛన్ విధానం మాదిరి ఎన్పీఎస్ ప్రయోజనం ఉందని.. కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం మాదిరి యూపీఎస్ ఉందని ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూపీఎస్ మార్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగ వర్గాల నుంచి స్పందన లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook