Another Terrorist Attack in Kashmir: ఇటీవల మంగళవారం జరిగిన పహల్గాం ఘటన మరువక మందే జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు తెరపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై వాళ్ళ ఇంట్లోనే ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా రసూల్‌ను టార్గెట్ చేసి టెర్రరిస్టులు దాడికి పాల్పడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా పహల్గాం ఘటనలో ఇటీవల 27 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన మరవక ముందే మరోసారి ఈ విధంగా దాడి జరగడం ఆందోళనకు తెరతీస్తోంది.
అయితే గురువారం బందిపోరా చెక్ పోస్ట్ లో నిఘా వర్గాల సమాచారం మేరకు పాకిస్తాన్ చెందిన లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నవారిని జల్లెడ పడుతున్నారు. అయితే తాజాగా ఇలా సోషల్ యాక్టివిస్ట్‌పై దాడి జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే భద్రతా బలగాలు హై సెక్యూరిటీని పెంచేశాయి. కాల్పుల విషయం తెలవగానే అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు.
పహల్గాం ఘటన తర్వాత టెర్రరిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. వాళ్ళ ఇంటిని కూడా పేల్చి వేస్తున్నారు భద్రతా బలగాలు. ఇంటెలిజెన్స్ సహాయంతో భద్రతా బలగాలు టెర్రరిస్టులు దాక్కున ఏరియాలను జల్లెడ పడుతున్నారు. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు టెర్రరిస్టులను ఇప్పటికే అరెస్టు చేశారు. వాళ్ళ వద్ద నుండి చైనాకు సంబంధించిన పిస్తోల్, రెండు మ్యాగజైన్లు, కొన్ని బుల్లెట్లను, ఒక హ్యాండ్ గ్రానైట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
In #Kashmir, a 45-year-old social activist Ghulam Rasool Magray was shot and injured by terrorists at his residence in Kandi Khas area of #Kupwara district late last night.
— News Vibes of India (@nviTweets) April 27, 2025
READ ALSO: నేడు ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు..
READ ALSO: నేటి రాశిఫలాలు.. ఆదివారం అమావాస్య ఏ రాశులకు జాగ్రత్త తప్పనిసరి?
ఆపరేషన్ లో గడచిన 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అంతేకాదు ఈ ఉగ్ర సంస్థలతో అనుబంధం ఉన్న వారిని చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాళ్లకు సంబంధించిన ఇళ్ళను కూడా కూల్చివేసిన సంగతి తెలిసిందే. 2018 పూల్వామా అటాక్ నిందితుడైన హసన్ ఉల్ హక్ ఇంటిని కూడా పేల్చివేశారు. ఇది కాకుండా షాహిద్ అహ్మద్ సీనియర్ లష్క్‌రే తోయిబా కమాండెంట్ యాంటీ నేషనల్ చర్యలకు పాల్పడుతున్న టెర్రరిస్ట్ తో పాటు జకీర అహ్మద్ అనే మరో టెర్రరిస్ట్ ఇంటికి కూడా పేల్చివేశారు.
అయితే గత రెండు రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ మరోసారి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి గలి, రాంపూర్ సెక్టర్లలో ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యం ఇండియన్ ఆర్మీ పై కాల్పులు జరిపారు. మన సైన్యం కూడా తిప్పి కొడుతోంది.
ఇక అనుకోకుండా బార్డర్ దాటి, పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. 80 గంటల్లో పాక్ అధికారులతో మూడుసార్లు చర్చలు జరిపిన ఫలితం లేకపోయింది. అక్కడి అధికారులు అతడి ఆచూకీ తెలియడం లేదని బుకాయిస్తున్నారు. అయితే బిఎస్ఎఫ్ మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









