తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం ( Anti hindi movement ) ప్రారంభమైంది. సోషల్ మీడియా సాక్షిగా రేగిన ఉద్యమంపై అటు బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. తమిళ పార్టీలు వర్సెస్ బీజేపీ సమరం మొదలైంది.
హిందీ తెలియదు పోరా..ఇప్పుడు తమిళనాట ( Tamilnadu ) ఇదే హాట్ టాపిక్ గా మారింది. కొందరు సినీ సెలబ్రిటీలు, యువత ఈ వ్యాఖ్యలు ప్రింట్ చేసిన టీ షర్టులతో ఉద్యమం ముందుకు నడిపిస్తున్నారు. అటు బీజేపీ మాత్రం ఎదురుదాడికి దిగుతోంది. హిందీ నేర్చుకున్నంత మాత్రాన తమిళానికి ఏమీ కాదని..డీఎంకేనే గల్లంతవుతుందంటూ ప్రత్యారోపణలు చేస్తోంది.
ముందు నుంచీ హిందీకు తమిళనాడు వ్యతిరేకమే. గతంలో కాంగ్రెస్ పాలకులు బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ఉద్యమం ఒక్కసారిగా ఎగిసింది. దాంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. హిందీ, సంస్కృతాన్ని తమిళులు దరిదాపుల్లోకి రానివ్వరు. విద్య, ఉపాధి రంగాల్లో తమిళులకే పెద్దపీట ఉంటుంది. తాజాగా త్రి భాషా విధానంతో హిందీ, సంస్కృతంను రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ కేంద్రంపై తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా ఉద్యమం ప్రారంభమైంది. కనిమొళి నేతృత్వంలో సోషల్ మీడియా సాక్షిగా హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. చెన్నా ఎయిర్ పోర్ట్ ( Chennai Airport ) లో కనిమొళి ( kanimozhi ) కు ఎదురైన ఘటనే దీనికి నిదర్శనం. ఈ ఉద్యమానికి సినీ సెలెబ్రిటీలు, యువత మద్దతుగా నిలిచారు. హిందీ తెలియదు పోరా..నేను తమిళం మాట్లాడే భారతీయుడిని అంటూ నినాదాలున్న టీషర్టులతో సోషల్ మీడియాకు ఎక్కుతున్నారు.
ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ ఎదురుదాడికి దిగింది. హిందీ నేర్చుకున్నంత తమిళానికి ఏం కాదని...డీఎంకే పార్టీనే గల్లంతవుతుందంటూ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు తమిళనాట హిందీ వ్యతిరేకులకు బీజేపీకు మధ్య సమరం మొదలైపోయింది. Also read: India-China standoff: చైనా సైన్యమే గాల్లోకి కాల్పులు జరిపింది: భారత సైన్యం