Kejriwal Master Plan: తాజాగా ఉప ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లూథియానా వెస్ట్ అసెంబ్లీ సీటును కైవసం చేసుకుంది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సంజీవ్ అరోరా.. అక్కడి నుంచి విజయం సాధించారు. సంజయ్ అరోరా రాజీనామా రాజ్యసభ చేయడనుండటంతో అక్కడి నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరిలో దిగబోతున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఈ యేడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా ఓటమి పాలైయింది. దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు.
దీంతో ఖాళీగా ఉన్న కేజ్రీవాల్ .. రాజ్యసభకు వెళ్లడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ కు సీట్ల పరంగ చూసుకున్నా.. ఢిల్లీ నుంచి రాజ్యసభకు వెళ్లడం అంత ఈజీ కాదు. అందుకే తమ పార్టీ పరిపాలనలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారు. ఓ రకంగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ వాయిస్ వినిపించాలనుకుంటున్నారు. ఓ రకంగా ప్రధాన మంత్రికి రాజ్యసభలో చుక్కలు చూపించాలనే ఆలోచనలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాసనస సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ 48 సీట్లలో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరుపున రేఖా గుప్తా సీఎం అయ్యారు. దాదాపు బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో మహిళ ముఖ్యమంత్రి లేరు. అందుకే రేఖా గుప్తాను సీఎంను చేశారు. ముఖ్యంగా అవరింద్ కేజ్రీవాల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా.. ఓ మహిళగా కేజ్రీవాల్ ను రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశ్యంతో బీజేపీ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్టు రాజకీయా విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ మూడోసారి సున్నా సీట్లతో హాట్రిక్ సాధించింది. మరి కేజ్రీవాల్ రాజ్యసభ ఎంట్రీతో బీజేపీ ఏ విధంగా ఇరుకున పెడతారన్నది చూడాలి.గుజరాత్ లో ఆమ్ ఆద్మి పార్టీ గెలిచిన సీటు గతంలో అదే పార్టీ అభ్యర్థి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. గతంలో ఆ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించేవారు. ఈ సీటులో బీజేపీ గెలిచిన దాఖలాలు తక్కువ.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









