Crpf Jawan Video: ఇదిగో ప్రూఫ్.. అన్ని సర్టిఫికేట్స్ సమర్పించి పాక్ యువతితో పెళ్లి.. అసలు నిజం బైటపెట్టిన జవాన్... వీడియో వైరల్..

Crpf jawan Munir ahmed video:  జమ్ములోని గరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ గతంలో పాక్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే..ఈ విషయం తమకు తెలియదనీ.. సీఆర్పీఎఫ్ అధికారులు జవాన్ ను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఆయన తన దగ్గర ఉన్న ప్రూఫ్ ను చూపిస్తు ఒక వీడియోను రిలీజ్ చేశాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 4, 2025, 06:33 PM IST
  • కేంద్రం న్యాయం చేయాలని జవాన్ రిక్వెస్ట్..
  • కోర్టులో తెల్చుకుంటానని కామెంట్స్..
Crpf Jawan Video: ఇదిగో ప్రూఫ్.. అన్ని సర్టిఫికేట్స్ సమర్పించి పాక్ యువతితో పెళ్లి.. అసలు నిజం బైటపెట్టిన జవాన్... వీడియో వైరల్..

Armed crpf jawan Munir ahmed says i have proofs video: జమ్ము కశ్మీర్ లోని పహల్గం ఉగ్రకుట్రపై భారత్ సీరియస్ అయ్యింది. మొత్తంగా భారత్ పాక్ కు చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో సింధు జలాల్ని, బాబ్లీ డ్యామ్ ను సైతం క్లోజ్ చేసింది. పాక్ దిగుమతులపై నిషేధం విధించింది. నౌకయానం, గగనతలంపై పాక్ నౌకలు, విమానాల్ని నిషేధించింది. ఈ క్రమంలో పాక్ పౌరుల్నిసైతం వారి దేశానికి వెళ్లేలా ఆదేశాలు జారీచేసింది.

Add Zee News as a Preferred Source

ఇప్పటికే మనదేశంలో ఉన్న పాక్ పౌరులు దాదాపుగాతమ దేశంకు వెళ్లిపోయారు.అయితే.. జమ్ములోని గరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్ అనే సీఆర్పీఎఫ్ జవాన్, పాక్ యువతిని పెళ్లిచేసుకున్నాడు. అతను తన పెళ్లిని సీక్రెట్ గా ఉంచడమే కాకుండా.. కేంద్రం విధించిన గడువు తర్వాత కూడా పాక్ యువతిని తన ఇంట్లోనే సీక్రెట్ గా దాచి ఉంచాడు .అది కాస్తా అధికారులకు తెలిసింది.

 

దీంతో సీరియస్ అయిన సీఆర్పీఎఫ్ అధికారులు జవాన్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో మునీర్ అహ్మద్ తాజాగా.. ఒక వీడియోను రిలీజ్ చేశాడు.  తన పెళ్లి గతేడాది మే 28న వీడియో కాల్ తో  జరిగిందన్నారు.  ఈ ఏడాది తన భార్య.. ఫిబ్రవరి 28న భారత్ కు వచ్చిందన్నాడు. అప్పుడు తాను అన్నిరకాలు సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ లను తన ఉన్నతాధికారులకు లెటర్ రూపంలో పంపానని చెప్పాడు.

Read more: ndia-Pakistan:  పాక్‌కు మరో ఝలక్ ఇచ్చిన భారత్.. ఇంకా చుక్క నీటి కోసం చుక్కలు చూడాల్సిందే..!

ఈ క్రమంలో తన దగ్గర అక్నాలెడ్జీమెంట్ కూడా ఉన్నాయన్నారు. చివరకు తన డిపార్ట్ మెంట్ నుంచి  ఎన్ఓసీ కావాలని అడిగినట్లు చెప్పుకొచ్చాడు. అలాంటిది అవసరంలేదని.. అధికారులు తనకు చెప్పారని... వారు ఇచ్చిన లెటర్ తన దగ్గర ఉందని అన్నాడు. తనకు విధుల నుంచి తొలగించడం అన్యాయమని చెప్పుకొవచ్చాడు. దీనిపై కేంద్రం మళ్లీ ఆలోచించాలని రిక్వెస్ట్ చేశారు. ఒక వేళ కేంద్రం తనకు న్యాయం చేయకపోతే.. కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తానని జవాన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News