Punjab Politics: ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో దేశ రాజకీయాల్లో సంచలనం. సామాన్యుల పార్టీగా అవినీత రహిత సమాజం అంటూ మొదలైన ఈ పార్టీ ప్రస్థానం.. అదే అవినీతి ఆరోపణలతో కూరుకుపోయి మొన్నటి ఎన్నికల్లో అధికారానికి దూరమైంది. వరుసగా రెండు సార్లు ఢిల్లీ అసెంబ్లీ సీట్లను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో 22 సీట్లకే పరిమితమైంది. 2015, 2020 వరుసగా 50 శాతానికి పైగా ఓట్లు సంపాదించిన ఆమ్ ఆద్మీ పార్టీ .. ఈ సారి ఏకంగా 10 శాతం తక్కువగా ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, లిక్కర్ కుంభకోణంలో పలువురు అగ్ర నేతలు అరెస్ట్ కావడం వంటివి ఉన్నాయి. సామాన్యుల పార్టీ అంటూ చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ.. శీష్ మహల్ పేరిట కొన్ని వందల కోట్లు తగేలేయడం.. రోడ్లు.. విద్యుత్, మంచి నీరు, పొల్యూషన్ ఇలా ప్రతి దాంట్లో ఆ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడింది. పైగా కేంద్రంలో ఉన్న ఢిల్లీ ప్రభుత్వంతో తరచు తగువులు పడటం వంటివి కూడా ఆయన పై ఢిల్లీ ప్రజల్లో ఓ వర్గం వారికి ఆయనపై తీవ్ర ఆగ్రహం కలిగించేలా చేసింది. దీంతో అరవింత్ కేజ్రీవాల్ స్యయంగా న్యూ ఢిల్లీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి పర్వేష్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటూ ఢిల్లీలో ఆప్ ఓడిపోవడానికి పలు కారణాలున్నాయి. అయితే.. ఢిల్లీలో మద్యం కుంభకోణంలో అరెస్టై .. విడుదలైన తర్వాత ఆయన ఫైల్స్ పై సంతకాలు పెట్టడానికి వీల్లేందంటూ కోర్టు ఆంక్షలు విధించడంతో విధిలేని పరిస్థితుల్లో తన ప్లేస్ లో ఆతిషి మార్లెనాను ముఖ్యమంత్రిని చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ ముఖ్యనేతలై కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలు ఓడిపోయనా.. ఆతిషి మాత్రం కాల్కాజీ స్థానం నుంచి గెలుపొందింది. అంతేకాదు తన పార్టీ ఓడిపోయిన బాధ ఇసుమంతైన లేకుండా తన కార్యకర్తలతో కలిసి చిందేయడం వంటివి సంచలనం రేపాయి.
ఢిల్లీలో అధికారం పోగోట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ .. ఇపుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పంజాబ్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం భగవంత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్ తో భేటి కావడంతో ఈ ఊహాగానాలకు ప్రాధాన్యత చేకూరింది.
మరోవైపు పంజాబ్‌లో దాదాపు మూడు డజన్ల మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది. అంతేకాదు ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత కేజ్రీవాల్ ఇప్పుడు మాన్ స్థానంలో పంజాబ్ సీఎం పదవిని చేపట్టాలని యోచనలో ఉన్నట్టు బీజేపీ చెబుతోంది. మహారాష్ట్రలో శివసేన చీలిక నేత ఏక్‌నాథ్ షిండే చేసినట్లుగానే, పంజాబ్ లో భగవంత్ మాన్.. మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి కేజ్రీవాల్‌పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక ఆప్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో టచ్‌లో ఉన్నారని పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుఖ్‌జిందర్ సింగ్ రాంధావా పేర్కొన్నారు.ఇక పంజాబ్‌లో 30 మందికి పైగా ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
బిజెపి ముఖ్యమంత్రి మార్పు వాదన
పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ నుండి కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా, కేజ్రీవాల్.. భగవంత్ మాన్‌ను పక్కనపెట్టి పంజాబ్ సీఎం కావచ్చునని తెలిపారు. భగవంత్ మాన్ ఎన్నికల్లో చెప్పినట్టుగా మహిళలకు రూ. 1,000, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నియంత్రించడం వంటి హామీలను నెరవేర్చలేదనే కేజ్రీవాల్ భగవంత్ ను పక్కకు తప్పించి తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు.
ఆప్ నాయకులు ఈ వాదనలన్నింటిని ఖండించారు. బీజేపీ, కాంగ్రెస్ కలలు కంటున్నారన్నారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అఖండ విజయం సాధించింది, 117 సీట్లలో 92 సీట్లను గెలుచుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి మరియు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన తర్వాత పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్ కావడంతో ఇపుడీ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









