Assembly Election 2021 Full Schedule: కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Assembly Election 2021 Full Schedule live updates: న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2021 షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా కొద్దిసేపటి క్రితమే ఈ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Last Updated : Feb 26, 2021, 06:59 PM IST
  • తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు 2021.
  • నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా.
  • ఏయే రాష్ట్రాల్లో ఏ రోజున పోలింగ్ జరుగుతుందో వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం.
Assembly Election 2021 Full Schedule: కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Assembly Election 2021 Full Schedule live updates: న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2021 షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా కొద్దిసేపటి క్రితమే ఈ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 140 అసెంబ్లీ స్థానాల్లో, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు, వెస్ట్ బెంగాల్‌‌లో 294 అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు జరగాల్సి ఉన్న ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్‌ ప్రకటించారు.

ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి కూడా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను మే 2వ తేదీన ఎనౌన్స్ చేయనున్నారు. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో అక్కడి లోక్ సభ స్థానంలో ఖాళీ ఏర్పడి Tirupati bypolls నిర్వహించాల్సి రాగా, నాగార్జునసాగర్‌ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన నోముల నర్సింహయ్య మృతితో Nagarjuna Sagar bypolls అనివార్యమైంది.

Also read : West bengal survey: పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరిది..ఆ సర్వేలో ఏం తేలింది

కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనాక్ చెక్ పెట్టేందుకు గాను ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు  Online nominations దాఖలు చేసేవిధంగా వారికి CEC అవకాశం కల్పించింది. 

కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవడంతో పాటే ఆయా రాష్ట్రాల్లో  Election code అమలులోకి వచ్చినట్టు CEC Sunil Arora స్పష్టంచేశారు.

Tamil Nadu Assemby election 2021 schedule - తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఈసీ వెల్లడించింది.

Assam Assemby election 2021 schedule - అస్సాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

అస్సాంలో 126 స్థానాలకుగాను మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27వ తేదీన 47 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్‌ జరగనుండగా, ఏప్రిల్ 1న రెండో విడత పోలింగ్, ఏప్రిల్ 6న మూడో విడత పోలింగ్ జరగనున్నాయి. 

Kerala Assemby election 2021 schedule - కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్ ‌6న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది.

Also read : New guidelines for social media, digital, OTT: ఓటిటి, సోషల్ మీడియా, డిజిటల్‌కి కొత్త రూల్స్

West Bengal Assemby election 2021 schedule - పశ్చిం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

294 అసెంబ్లీ స్థానాలు ఉన్న West Bengal ‌లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

మార్చి 27న తొలి విడుత, April 1న రెండో విడుత, April 6న మూడో విడుత, April 10న నాలుగో విడత, April 17న ఐదవ విడుత, April 22న 6వ విడుత ఎన్నికలు, April 26న 7వ విడుత ఎన్నికలు, April 29న 8వ విడత ఎన్నికలు జరగనున్నాయి.  

Puducherry Assemby election 2021 schedule - పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకుగాను ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నట్టు CEC Sunil Arora తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News