Atal pension Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకోవచ్చింది. ఈ నేపథ్యంలో అటల్ పెన్షన్ యోజన కూడా. వృద్ధాప్యంలో ప్రధానంగా ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి ప్రజలకు ప్రవేశపెట్టిన ఓ అద్భుతమైన పథకం అని చెప్పాలి. అటల్ పెన్షన్ యోజన కింద ప్రతిరోజు రూ.48 మీరు పెట్టుబడి పెట్టిన చాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు పెన్షన్ పొందుతారు రూ.1000 నుంచి రూ.5000 వరకు మీరు పెన్షన్ పొందవచ్చు.
అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత..
అటల్ పెన్షన్ యోజనకు మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే దీనికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. ఇక గరిష్ట వయసు 40 ఏళ్లు అయితే దాదాపు ఇందులో 20 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్లకు ప్రతి నెల రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
ఒకవేళ మీరు 18 ఏళ్ల నుంచి అటల్ పెన్షన్ యోజనలో డబ్బులు పెట్టుబడి పెడితే నెలకు రూ.42 జమ చేస్తే 60 ఏళ్ల తర్వాత ప్రతినెల రూ.1000 పెన్షన్ గా పొందుతారు. ఒకవేళ నేలకు రూ.210 చెల్లిస్తే రిటైర్మెంట్ తర్వాత మీరు ప్రతి నెల రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
READ ALSO: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి హాయిగా సాగిపోతే, వీరికి మాత్రం కష్టాలు తిష్ట వేసుకుని కూర్చుంటాయి..
పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకునే వారి 40 ఏళ్ల వయసులో నెలకు రూ.291 రూపాయలు చెల్లిస్తే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందవచ్చు. అయితే నెలకు రూ.291 నుంచి రూ.1454 వరకు మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ప్రతి రోజు రూ.48 చెల్లిస్తే రిటైర్మెంట్ పొందిన తర్వాత ప్రతినెల రూ.5000 పెన్షన్ పొందవచ్చు.
అంటే 40 ఏళ్ల వయసులో ప్రతి నెల రూ.1454 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెల రూ.5000 పెన్షన్ పొందుతారు. అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకులకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే దీనికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా మీ వద్ద ఉండాల్సిందే. ఆన్‌లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO: ఎండ వేడిమిలో డిహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లలో ఇవి కలుపుకొని తాగండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









