Pension: వృద్ధాప్యంలో భార్యాభర్తలు రూ.10 వేల పెన్షన్‌ పొందాలంటే ఈ చిన్న పని చేయండి..!

Atal Pension Yojana: రిటైర్‌మెంట్ పొందిన తర్వాత పెన్షన్ పొందలేమనే బాధలో ఉన్నారా? ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం అద్భుతమైన పథకం తీసుకువచ్చింది. ఇందులో మీరు ఒక్కరు మాత్రమే కాదు..  భార్యాభర్తలు కలిసి కూడా పెన్షన్ పొందవచ్చు. మీకు నెలకు రూ.10 వేల పెన్షన్ పొందాలంటే ఈ చిన్న పని చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన ద్వారా మీరు సులభంగా నెలకు పింఛను పొందవచ్చు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Dec 10, 2025, 06:02 PM IST
Pension: వృద్ధాప్యంలో భార్యాభర్తలు రూ.10 వేల పెన్షన్‌ పొందాలంటే ఈ చిన్న పని చేయండి..!

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు రైతులు, లోయర్ మిడిల్ క్లాస్, పేదవారి కోసం తీసుకువచ్చింది. అయితే అసంఘటిత వర్గాలకు చెందిన వారు రిటైర్‌మెంట్ తర్వాత పెన్షన్ పొందలేరు. ఈ నేపథ్యంలో వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనా అనే అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ పథకంలో భార్యాభర్తలు కలిసి రూ.10,000 పెన్షన్ నెలవారీ సులభంగా పొందవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

 అటల్ పెన్షన్ యోజనలో మీరు పెట్టుబడి పెడితే నెల నెల మీరు పదివేల పెన్షన్ పొందవచ్చు. ఇందులో రూ.1000 నుంచి రూ.5000 వరకు సులభంగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రిటైర్‌మెంట్ పొందిన తర్వాత పెన్షన్ పొందుతారు. 60 ఏళ్లు దాటిన తర్వాత భార్యాభర్తలు కలిసి రూ.5000 చొప్పున పెన్షన్ పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.10,000 నెల నెల పొందుతారు.

అటల్‌ పెన్షన్‌ అర్హత..
అటల్ పెన్షన్‌ యోజన దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో మాత్రమే ఉండాలి. ప్రతి నెల మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత సులభంగా మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. అటల్ పెన్షన్ ద్వారా ప్రతి ఒక్కరు రూ.5000 సులభంగా పొందవచ్చు. అయితే మీరు ఈ పథకంలో చేరేటప్పుడు మీ వయస్సు 30 ఉండాలి. 

ప్రతి నెల మీరు రూ.577 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వయసు 35 ఉంటే మీరు రూ.902 ప్రతినెల చెల్లించాలి . అటల్ పెన్షన్ యోజన ద్వారా మీరు కూడా బెనిఫిట్ పొందాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా ఆఫీస్ బ్రాంచీలకు సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంకు వివరాలు ఉంటే సరిపోతుంది.

 అయితే అటల్ పెన్షన్ యోజనలో భార్యాభర్తలు కలిసి జాయిన్ అవ్వడం వల్ల ప్రతినెల రూ.10,000 పొందుతారు. ఇప్పటికే చాలామంది ఈ పథకంలో చేరారు. ప్రధానంగా అసంఘటిత కార్మికులు ఈ పథకంలో చేరితే భార్యాభర్తలు కలిసి నెలవారీ రూ. 10,000 పెన్షన్ పొందవచ్చు. ఆ సమయంలో ఇతరులపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్ పథకం ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంది.

 ఈ పథకం 2017 లో అసంఘటిత రంగాలకు చెందిన కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. వీరు 60 ఏళ్ల తర్వాత సులభంగా పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. ఈ అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే కనీసం నెలకు రూ.1000, గరిష్టంగా రూ.5000 పెన్షన్ కూడా లభిస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఈ పథకం ప్రారంభిస్తే మీరు కేవలం రూ.210 చెల్లిస్తే ప్రతినెలా రూ.5000 పెన్షన్ పొందుతారు.  అంటే రోజుకు కేవలం రూ.7 మాత్రమే.30 సంవత్సరాల వయసులో ప్రారంభిస్తే రూ.577 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 39 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే రూ.1318 చెల్లించి మీరు 60 ఏళ్ల తర్వాత సులభంగా పెన్షన్ పొందవచ్చు.

ఇదీ చదవండి: Free Electricity: కేంద్ర ప్రభుత్వం భారీ కానుక.. ప్రతినెలా 150 యూనిట్ల విద్యుత్‌ ఉచితం..!

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ మైండ్‌బ్లోయింగ్‌ మంత్లీ ప్లాన్‌.. రూ.154 కే 365 రోజుల నెలవారీ వ్యాలిడిటీ ప్లాన్‌..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News