
Ayodhya Ramayalam: ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. అయోధ్య చుట్లూ 4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడను 18 నెలల్లో పూర్తి చేయాలనే డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర ఈ విషయం వెల్లడించారు. గోడను ఇంజనీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందన చెప్పారు. దాని ఎత్తు, మందం, డిజైన్ వంటి విషయాలను నిర్ణయించామన్నారు. మట్టి పరీక్షలు నిర్వహించాక పని ప్రారంభిస్తామని తెలిపారు.
ఆలయ నిర్మాణంలో పురోగతి, కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి వంటి విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. మందిర నిర్మాణం మరో ఆరు నెలల్లో అన్నివిధాలా పూర్తి కాబోతోందని మిశ్ర తెలిపారు. రామాలయ సముదాయంలోనే 10 ఎకరాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తామని చెప్పారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం మరో పదెకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. సప్త మండల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ జైపుర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని వెల్లడించారు.అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది. భద్రతను మరింత పెంచారు. ఈ నేపథ్యంలో భారీ గోడ నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe