Cell Phone Addiction: టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరిచింది. కానీ అదే టెక్నాలజీ మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నది అన్నదమ్ముల సందేహం లేదు. కొన్ని దశాబ్దాల క్రితమే బల్గేరియా జ్యోతిష్కురాలు.. బాబా వంగా చిన్నపాటి పరికరాల వల్ల మానవులు మానసికంగా బలహీనపడతారని హెచ్చరించారు. ఆమె చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు నిజమవుతోందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాబావంగా చెప్పిన ఎన్నో విషయాలు నిజం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా గురించే కాకుండా ఈ మధ్య జరిగిన ఎన్నో సంఘటనలను ముందుగానే చెబుతూ ఆమె కంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో కొద్ది సంవత్సరాల క్రితమే బాబావంగా సెల్ఫోన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిలో కలవరం రేపుతున్నాయి.
ఈ భవిష్యవాణిలో ఆమె చిన్నపాటి పరికరం మానవ జీవితాన్ని ఆక్రమిస్తుందని..మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈరోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు మొబైల్ ఫోన్లపై అధికంగా ఆధారపడుతున్నారు. ఇది నిద్రలేమి, ఒత్తిడి, మానసిక ఆందోళనలకు కారణమవుతోంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ ఫోన్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు తెలియకుండానే గురవుతున్నారు. అయినా కానీ ఈ సెల్ ఫోన్ అనేది మన జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది. ఒకరకంగా చెప్పాలి అంటే మనకు అది రోగం అని తెలిసిన మనం దానిని వదల్లేనంత బలహీన పడిపోతున్నాము.
పిల్లలపై ప్రభావం:
ఇండియా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రకారం, 24 శాతం పిల్లలు నిద్రకు ముందు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఇది నిద్రను భంగపెట్టడం, ధ్యాన సామర్థ్యాన్ని తగ్గించడం, లాంగ్ టెర్మ్ లో మెమరీ లాస్ సమస్యలకు దారితీస్తోంది.
పెద్దలపై ప్రభావం:
నడుస్తూ ఉన్నప్పుడు కూడా స్క్రోల్ చేయడం, రాత్రిపూట మొబైల్ బ్రౌజింగ్ వంటివి మన మెదడుపై ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. అంతేకాకుండా.. సోషల్ మీడియా అతి వినియోగం వల్ల మెడ నొప్పి, కళ్ల నొప్పి, ఒత్తిడి, ఒంటరితనం ఏర్పడుతున్నాయి. వ్యక్తిగత సంబంధాలు కూడా బలహీనపడుతున్నాయి.
శారీరక, మానసిక ప్రభావాలు:
డిజిటల్ ఐ స్ట్రెయిన్, టెక్స్ట్ నెక్, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, ఫోకస్ లోపం, ఒంటరితనం, కుటుంబ సంబంధాల బలహీనత.. ఇలా ఒక్కటేమీ ఈ సెల్ ఫోన్ వల్ల .. అందరూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మొబైల్ అడిక్షన్ నివారణకు సూచనలు:
1. టెక్ ఫ్రీ జోన్లు ఏర్పాటు చేయాలి.
2. స్క్రీన్ టైమ్ ట్రాక్ చేసే యాప్స్ వినియోగించాలి.
3. కుటుంబంతో నేరుగా మాట్లాడే అవకాశం పెంచుకోవాలి.
4. అవసరం లేని నోటిఫికేషన్లు ఆఫ్ చేయాలి.
5. ఇంస్టాగ్రామ్ లాంటివి చూడటానికి ఒక టైం అంటూ పెట్టుకోవాలి.
ఇలా కొన్ని నివారణలు పాటిస్తేనే మన జీవితంలో మనం సెల్ ఫోన్ కి మరీ అది తవ్వకుండా ఉండగలం. లేదా దీనివల్ల వచ్చే డేంజర్స్ ఎదుర్కోక తప్పదు.
ఇకనైనా అప్రమత్తం కావాలి. బాబా వంగా హెచ్చరించినట్టే — ఈ చిన్న పరికరం మన ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారుతోంది.
Also Read: KTR Speech: 'అవలక్షణాలు ఉన్న రేవంత్ రెడ్డితో తెలంగాణ రెండు దశాబ్దాలు వెనక్కి': కేటీఆర్ ఆందోళన
Also Read: Harish Rao: పాకిస్థాన్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు.. కానీ రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు: హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter