Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు.. ప్లాన్‌ చేసుకుంటే ఏకంగా ఐదు రోజుల సెలవులు

Bank Holiday Tomorrow Occasion Of Mahavir Jayanti: ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బ్యాంకులకు మరో సెలవు లభించింది. బ్యాంకు ఖాతాదారులు ఈ సెలవు విషయాన్ని గ్రహించి ముందే తమ ఆర్థిక వ్యవహారాలు మార్చుకోవాల్సి ఉంది. అయితే రేపు ఎందుకో సెలవో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 9, 2025, 05:03 PM IST
Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు.. ప్లాన్‌ చేసుకుంటే ఏకంగా ఐదు రోజుల సెలవులు

Bank Holiday Tomorrow: బ్యాంకు ఉద్యోగులకు మరో శుభవార్త. ఈవారంలో ఇప్పటికే రెండో శని, ఆదివారం రాగా.. మరో సెలవు వచ్చేసింది. ఏప్రిల్‌ నెలలో భారీగా సెలవులు రాగా.. వాటిలో భాగంగా మరో సెలవు లభించింది. పక్కాగా ప్లాన్‌ చేసుకుంటే వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఒక సెలవుకు మధ్యలో వచ్చిన రెండు పని దినాలను సెలవు పెడితే మాత్రం ఆ తర్వాత వరుసగా రెండు సెలవులు ఉన్నాయి. దీంతో మొత్తం ఐదు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ సెలవు ఎందుకో తెలుసా? ఆ సెలవు తెలుగు రాష్ట్రాల్లో ఉందా? ఏయే రాష్ట్రాల్లో ఉందో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Miss World 2025: తెలంగాణ కీర్తిని పెంచేలా మిస్​ వరల్డ్​ పోటీలు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

ఏప్రిల్‌ 10వ తేదీన మహావీరుడి జయంతి ఉంది. మహావీరుడి జయంతిని కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పండుగగా భావిస్తుంటారు. అతడి జయంతి రోజున కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. మహావీర్‌ జయంతి రోజు ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటారు. మహావీర్‌ జయంతి అంటే కొన్ని రాష్ట్రాల్లో అన్నీ సేవలు బంద్‌ ఉంటాయి. విద్యాలయాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఈ క్రమంలో ఆర్థిక రంగంలో కీలకమైన బ్యాంకులకు కూడా సెలవు ఉండనుంది. అయితే ఆ సెలవు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేదు.

Also Read: WhatsApp Governance: వాట్సప్‌ గవర్నెన్స్‌లో వెయ్యి సేవలే లక్ష్యం.. 15 నుంచి కొత్త కార్యక్రమం

గుజరాత్‌, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, న్యూఢిల్లీ, చత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో మహావీర్‌ జయంతి సందర్భంగా బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి. బ్యాంకులు మూసివేసి ఉండడంతో లావాదేవీలు శుక్రవారానికి వాయిదా వేసుకోవాల్సి ఉంది. అయితే ప్రత్యక్ష బ్యాంకింగ్‌ సేవలు లేకపోయినా డిజిటల్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

కాగా ఈ నెలలోనే మరికొన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంబేడ్కర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడే, బొహగ్‌ బిహు, బసవ జయంతి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక దినాలకు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. గరియా పూజ, భగవాన్‌ శ్రీ పరశురామ్‌ జయంతి వంటి ప్రత్యేక రోజుల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకులకు సంబంధించిన సెలవులను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ముందే ప్రకటిస్తుంటుంది. జాతీయ సెలవులతోపాటు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు.. సంప్రదాయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ సెలవులు ప్రకటించింది. అందులో భాగంగా మహవీర్‌ జయంతికి బ్యాంకుల సెలవు ఉంది. అయితే ఆ సెలవు తెలంగాణ, ఏపీలో కాకుండా మిగతా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News