Bank Holidays: వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు

Bank Holidays: దేశంలోని బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లకు ముఖ్య గమనిక. అన్ని బ్యాంకులు వరుసగా  నాలుగు రోజులు మూతపడనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు ఎప్పుడు సెలవులున్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2025, 09:19 PM IST
Bank Holidays: వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు

Bank Holidays: ఆన్‌లైన్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు వినియోగంలో వచ్చాక బ్యాంకులకు వెళ్లే పని దాదాపుగా తగ్గిపోయింది. కానీ కొన్ని పనులకు మాత్రం ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ఆర్బీఐ ప్రతినెలా జారీ చేసే బ్యాంకు సెలవుల జాబితా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. కొన్ని సెలవులు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. 

Add Zee News as a Preferred Source

దేశంలోని బ్యాంకులకు నాలుగు ఆదివారాలతో పాటు రెండు, నాలుగు శనివారాలు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా పండుగలు , ప్రత్యేక రోజుల సెలవులుంటాయి. ఈ సెలవుల్లో పబ్లిక్ హాలిడేస్, రీజనల్ హాలిడేస్ ఉంటాయి. ఈ నెలలో హోలీ పండుగ ఉంది. ఈ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో 2-3 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండటంతో కోట్లాదిమంది కస్టమర్లపై ప్రభావం పడనుంది. హోలీ అనేది వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో జరుపుకుంటారు. అందుకే సెలవులు కూడా మారుతుంటాయి. 

హోలీ పండుగ పురస్కరించుకుని మార్చ్ నెలలో ఈ వారంలో బ్యాంకులు మూతపడనున్నాయి. వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హోలీ పురస్కరించుకుని మార్చ్ 13, 14, 15, 16 తేదీల్లో వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. ఒకవేళ బ్యాంకుకు సంబంధించి ముఖ్యమైన పనులు ఉన్నవాళ్లు ఇది గమనించాల్సి ఉంటుంది. ముందుగా గమనించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

మార్చ్ 13న హోలికా దహనం సందర్భంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కేరళలో రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఢిల్లీ, ముంబై సహా ఇతర రాష్ట్రాల్లో యథావిధిగా పనిచేస్తాయి. 

ఇక మార్చ్ 14న ధులండి హోలీ కలర్స్ పురస్కరించుకుని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే కర్ణాటక, ఒడిశా, మణిపూర్, తమిళనాడు, త్రిపుర, కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి. 

మార్చ్ 15 హోలీ వేడుకల సందర్భంగా త్రిపుర, ఒడిశా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం యథావిధిగా బ్యాంకులు ఓపెన్ అయి ఉంటాయి. 

మార్చ్ నెల బ్యాంకు సెలవుల జాబితా

మార్చ్ 16 ఆదివారం బ్యాంకులకు సెలవు
మార్చ్ 22 నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు
మార్చ్ 23 ఆదివారం బ్యాంకులకు సెలవు
మార్చ్ 27 షబ్ ఎ ఖదర్ జమ్ము కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
మార్చ్ 28 జుమ్మా తుల్ విదా జమ్ము కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
మార్చ్ 30 ఆదివారం బ్యాంకులకు సెలవు
మార్చ్ 31 రంజాన్ పండుగ బ్యాంకులకు సెలవు

ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఇందులో రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి సెలవులు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ బ్యాంకులకు వివిధ కారణాలతో సెలవు ఉన్నా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. 

Also read: Team India Schedule: టీమ్ ఇండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇంగ్లండ్ సిరీస్ తరువాత రెస్ట్ ఉందా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News