Heavy Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఫలితంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా పలు జిల్లాల్లో కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మండు వేసవిలో భగభగ మండే ఎండల్నించి పూర్తిగా ఉపశమనం లభించింది. వాతావరణంలో మార్పులతో తమిళనాడులో చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. చెన్నైలో అయితే గిండి, అశోక్ నగర్, వడపళని సహా పలు ప్రాంతాలు జలదిగ్భంధమయ్యాయి. రోడ్లపై నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ స్థంబించింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులు వెళ్లేవారికి చాలా సమస్యగా మారింది. చెన్నై నగరంలో కొద్ది గంటల వ్యవధిలోనే 16 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వరద భయం వెంటాడింది. ఎందుకంటే కొన్ని అండర్ పాస్ వంతెనల కింద బస్సులు వరద నీటిలో మునిగాయి.
ఇక తమిళనాడులో రానున్న ఐదు రోజులు అంటే ఏప్రిల్ 21 వరకూ భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక రామనాథపురం, విరుదునగర్, ధర్మపురి సేలం, ఈరోడ్ వంటి 5 జిల్లాలకు ఎల్లో ఆలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అటు చెన్నై నగరంలో కూడా ఈ నెల 21 వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.
Also read: Amaravati Farmers: ప్రభుత్వ నిర్ణయం అమరావతి రైతులకు శాపమేనా, ఆందోళన బాట పట్టనున్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









