Rains in Summer: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కల్గించింది. ఈ రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అంతేకాకుండా మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మరో రెండ్రోజులు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
మండు వేసవిలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. ఫలితంగా కర్ణాటక, తమిళనాడులోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.బెంగళూరు నగరంలో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా కర్ణాటక కోస్తా తీర ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడ్డాయి. మడికెరి, చామరాజ నగర, దక్షిణ కన్నడ, ఉడుపి, హసన్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పశ్చిమ కనుమలు మళ్లీ పచ్చదనాన్ని పొందాయి. మంగళూరు, ముల్కి, మూడబిద్రి, పుత్తూరు, బంట్వాల, విట్లె, సుళ్య, సూరత్ కల్ పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అటు పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి కన్పించింది. తిరునల్వేలి, తెన్ కాశి, తూత్తుకూడి, విరుధునగర్, రామనాథపురం, పుదుక్కోట్టి, శివగంగ, తంజావూరు, మధురై జిల్లాల అప్రమత్తం చేశారు. తిరుచ్చి, ఈరోడ్ సేలం, తిరువారూర్, నాగపట్నం, మైలాడుథురై, దిండిగల్, కోటగరి, కోయంబత్తూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.
ఇక కేరళలో కూడా వర్షాల తీవ్రత అధికంగా కన్పించింది. వాయనాడ్, కన్నూర్, కాసర్ గాడ్ జిల్లాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు పడ్డాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. లా నినా బలహీనపడటం వల్లనే మండు వేసవిలో ఇలా వర్షాలు పడుతున్నాయని వాతారవరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో రెండు రోజులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. దాంతో కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గనున్నాయి.
Also read: Best Holi Destination: టాప్ 10 హోలీ డెస్టినేషన్ సెర్చింగ్ ప్రాంతాలు, బెస్ట్ మాత్రం ఆ ప్రాంతమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









