Bengal: బెంగాల్ మహిళలకు నరకం లాంటిది... మమతా ప్రభుత్వం గురించి బీజేపీ నేత ఎందుకు ఇలా అన్నారు?

West Bengal Car Accident : పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ జిల్లాలో ఒక మహిళ మరణంపై బిజెపి, టిఎంసి మధ్య వివాదం తీవ్రమవుతోంది. శాంతిభద్రతలకు సంబంధించి మమతా ప్రభుత్వంపై బిజెపి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్ మహిళలకు నరకం లాంటిది అంటూ మమతా ప్రభుత్వం బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   

Written by - Bhoomi | Last Updated : Feb 25, 2025, 08:30 PM IST
Bengal: బెంగాల్ మహిళలకు నరకం లాంటిది... మమతా ప్రభుత్వం గురించి బీజేపీ నేత ఎందుకు ఇలా అన్నారు?

West Bengal Car Accident:  బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో సోమవారం 27 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ఘటనపై టీఎంసీ, బీజేపీ మధ్య తగ్గాఫర్ ఫైట్ నడుస్తోంది. రెండు పార్టీల మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ నాయకుడు..  కునాల్ హోష్ ..బీజేపీ పై ఎదురుదాడికి దిగారు. కొంతమంది కావాలనే  మహిళ మరణాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు. 

Add Zee News as a Preferred Source

లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమని రుజువైతే, నిందితులను చట్టం ముందు నిలబెడతామన్నారు. అతివేగం, ట్రాఫిక్ సమస్య వల్లే ఆ మహిళ కారు ప్రమాదానికి గురైందన్నారు.  దీనికి శాంతిభద్రతలతో సంబంధం లేదన్నారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ నాయకుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాగా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఎన్నికలకు ముందు ఈ అంశం విపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది.  గత ఏడాది ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసుపై బిజెపి నిరంతరం టీఎంసీపై దాడి చేస్తూనే ఉంది. ఏ అవకాశం వచ్చినా దాన్ని అస్త్రంగా మార్చుకుంటై టీఎంసీపై ఎదురు దాడికి దిగుతోంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న వారిని టీఎంసీ కాపాడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.

బిజెపి నాయకుడు సుకాంత మజుందార్ సోమవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, మహిళలపై ప్రతిరోజూ జరుగుతున్న భయంకరమైన నేరాల గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉన్నారని, న్యాయం చేయడానికి బదులుగా నేరస్థులను రక్షిస్తున్నారంటూ ఆరోపించారు. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంలో మహిళలు ఎక్కడా సురక్షితంగా లేరని, అది ఆసుపత్రులు అయినా, హైవేలు అయినా అంటూ మండిపడ్డారు. జాతీయ రహదారిపై ఒక మహిళను దుండగులు వేధించి, వెంబడించారని, దాని కారణంగా ఆమె చనిపోయిందని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ మహిళలకు ప్రత్యక్ష నరకంగా మారిందని ఆయన అన్నారు.

Also Read: AI in Agriculture: వ్యవసాయంలో AI.. వీడియో షేర్ చేసిన సత్య నాదెళ్ల.. స్పందించిన మస్క్  

బిజెపి నాయకుడి ఆరోపణలను టిఎంసి నాయకుడు కునాల్ ఘోష్ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా తిప్పికొట్టారు. ఆ మహిళ లైంగిక వేధింపులకు గురైందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. బిజెపిపై దాడి చేస్తూ టిఎంసి నాయకుడు, గుర్తు తెలియని వ్యక్తులు అలాంటి కథను "ప్రచురిస్తున్నారని" ఆరోపించారు. 

Also Read: Gold Loan New Rules: బ్యాంకుల్లో నగలు తాకట్టు పెట్టడంపై కొత్త ఆంక్షలు.. తప్పక తెలుసుకోండి!   

అసలేం జరిగింది? 
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మహిళా ఈవెంట్ మేనేజర్ సుతంద్ర చటోపాధ్యా మరణించారు. సోమవారం తెల్లవారుజామున పశ్చిమబెంగాల్ లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమెతోపాటు కారులో ఉన్న మరో నలుగురు గాయపడ్డారు. బీహార్ లోని గయకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో సుతంద్ర కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జు అయ్యింది. అయితే సుతంద్ర చటోపాధ్యాయ మరణంపై ఆమె కారు డ్రైవర్ వాదన మరో విధంగా ఉంది. కొందరు ఆకతాయిలు వేధిస్తూ తమ కారును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ మీడియాకు తెలిపాడు. ఆదివారం అర్ధరాత్రి బీహార్ లోని గయకు పనిమీద వెళ్తున్నాం..ఈ క్రమంలోనే తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని బుడ్ బడ్ జాతీయ రహదారి దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర కొందరు దుండగులు మొదట మిమ్మల్ని అడ్డుకుని సుతంద్రను ను దుర్బాషలాడారు. మేము వారిని పట్టించుకోకుండా వెళ్తుంటే మిమ్మల్ని వెంబడించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఈవ్ టీజింగ్ వల్లే సుతంద్ర మరణించిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News