Bengal Lady Professor: క్లాస్ రూమ్‌లో విద్యార్థితో పెళ్లి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లేడీ ప్రొఫెసర్.. మ్యాటర్ ఏంటంటే..?

Lady Professor Marries student: వెస్ట్ బెంగాల్ లో ఇటీవల లేడీ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లోనే ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనపై తాజాగా.. లేడీ ఫ్రొఫెసర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 5, 2025, 03:34 PM IST
  • క్లాసులో స్టూడెంట్ ను పెళ్లి చేసుకున్న లేడీ ప్రొఫెసర్..
  • చట్టపరంగా ముందుకు వెళ్తానని వార్నింగ్..
Bengal Lady Professor: క్లాస్ రూమ్‌లో విద్యార్థితో పెళ్లి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లేడీ ప్రొఫెసర్.. మ్యాటర్ ఏంటంటే..?

Lady Professor Marries student in west bengal: వెస్ట్ బెంగాల్ లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. అప్లైడ్ సైకాలజీ హెచ్ఓడీ అయిన లేడీ ప్రొఫెసర్.. ఆ యూనివర్సీటీలోని ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ స్టూడెంట్‌ను క్లాసులోనే పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. సోషల్ మీడియాలో నెటిజన్లు లేడీ టీచర్ ను తెగ ట్రోల్ చేశారు. అంతే కాకుండా..ఇలాంటి పనిచేయడమేంటని కూడా తిట్టిపొశారు. 

Add Zee News as a Preferred Source

 

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని, యూనీ వర్సీటీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇది రచ్చగా మారడంతో.. స్టూడెంట్‌ను పెళ్లి చేసుకున్న లేడీ ప్రొఫెసర్‌ను అధికారులు సెలవుపై పంపించారు.

ఈ ఘటనలో సదరు లేడీ ప్రొఫెసర్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెప్పారు. తాజాగా.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. యూనీ వర్సీటీ అధికారులకు మెయిల్ సైతం పెట్టారు.   ఈ వీడియోను నాడియా జిల్లాలోని హరిన్‌ఘాటా క్యాంపస్‌ తరగతి గదిలో చిత్రీకరించినట్లు వెల్లడించారు. అది కేవలం ఒక డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ లో భాగంగానే చేసినట్లు చెప్పుకొచ్చారు. స్టూడెంట్ లకు సైతం ఆ విషయం తెలుసన్నారు.

Read more: Viral Video: బాప్ రే... నరాలు తేగె ఉత్కంఠ.. ఒకే బావిలో పడ్డ పెద్దపులి, అడవి పంది.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో వైరల్..

కొంతమంది కావాలని తనను వివాదంలోకి లాగారన్నారు. తన క్యారెక్టర్ ను కావాలని డీఫ్రెమ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఆ క్యాంపస్ లో పనిచేయలేనని, తన వీడియోను కావాలని లీక్ చేసిన వారిపై చట్టప్రకారం ముందుకు వెళ్తానని లేడీ ప్రొఫెసర్ హెచ్చరించారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News