Bengaluru Building Collapse: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం తప్పింది. ఖాళీ చేసిన క్షణాల్లోనే భవనం మొత్తం నేలకొరిగింది. కళ్ల ముందే పెద్ద భవనం కూలిపోయన వీడియో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరు నగరంలోని(Bengaluru)రద్దీగా ఉన్న ప్రాంతమది. ఓ చిన్న వీధి. పక్కపక్కనే ఉన్న 2-3 అంతస్థుల భవనాలు. అందులో ఓ పాత భవనం. కాలం చెల్లిన భవనం ఇవాళో, రేపో కుప్పకూలే పరిస్థితి. అందులో ఉండేదంతా దాదాపుగా చిన్నా చితకా పనులు చేసుకునేవారు, వలస కార్మికులే. భవనం ఏ క్షణంలోనైనా కుప్పుకూలిపోతుందనే అనుమానంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వలస కూలీల్ని అక్కడ్నించి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన కాస్సేపటికే అంటే కళ్లముందే చూస్తుండగానే కుప్పకూలిపోయింది. మూడంతస్థుల ఆ భవనం కూలిన (Building Collapsed)ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అధికారులు తెలిపారు. కళ్లముందే అందరు చూస్తుండగానే..అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సమక్షంలోనే భవనం కుప్పకూలిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఖాళీ ప్రక్రియ ఆలస్యమైతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగుండేది.&



 


Also read: Google Services: గూగుల్ ఎక్కౌంట్ బ్లాక్ కాకూడదంటే ఫోన్ మార్చుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook