Bengaluru Stampede: చిన్నస్వామి ఘటనలో బిగ్ ట్విస్ట్.. ముందే హెచ్చరిస్తు సర్కారుకు లేఖ రాసిన సీనియర్ పోలీసు.. వెలుగులోకి షాకింగ్ నిజం..

Chinnaswamy rcb rally stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విక్టరీ ర్యాలీకి ముందు కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీసు అధికారి దీనిపై ప్రభుత్వంతో పాటు, ఉన్నతాధికారులకు ఒక లేఖను రాసినట్లు విషయం వెలుగులోకి వచ్చింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 8, 2025, 02:13 PM IST
  • తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం..
  • వెలుగులోకి పోలీసు లేఖ..
Bengaluru Stampede: చిన్నస్వామి ఘటనలో బిగ్ ట్విస్ట్..  ముందే హెచ్చరిస్తు సర్కారుకు లేఖ రాసిన  సీనియర్ పోలీసు.. వెలుగులోకి షాకింగ్ నిజం..

Senior police had warning letter to karnataka govt amid rcb stampede: కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీమ్ సభ్యుల్ని సన్మానించేందుకు ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దాదాపు.. పద్దేనిమిదేళ్ల తర్వాత  ఆర్సీబీ కప్ సాధించడంతో  అభిమానులు దేశమంతట సంబరాలు జరుపుకున్నారు. కానీ చిన్నస్వామి స్టేడియంకు అనుకొని విధంగా ఫ్యాన్స్ తరలిరావడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

Add Zee News as a Preferred Source

గేట్లు, గోడలు దూకి.. అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో భారీగా తోపులాట జరిగి.. అనేక మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మంది ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలో ప్రస్తుతం ఆర్జీబీ ఘటనపైదేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా విచారణ ప్రారంభించింది.

అయితే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు.. పోలీసు కమిషన్ దయానంద్, ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్ర్ సహా, సీఎం సిద్దరామయ్య కార్యదర్శి కె. గోవింద రాజన్ లపై సస్పెన్షన్ లు విధించారు. ఈ అంశం కూడా వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా.. బెంగళూరు ఆర్సీబీ ర్యాలీ కన్నా ముందు..  ఒక డీసీపీ  కరిబసవన గౌడ ప్రభుత్వంతో పాటు, ఇతర ఉన్నతాధికారులకు ఆర్సీబీ ఈవెంట్ గురించి లేఖను రాసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్సీబీకిదేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈవెంట్ కు భారీగా అభిమానులు వచ్చే చాన్స్‌ ఉందని, పక్కనే విధాన సౌధ భవనం ఉందని.. ఇక్కడ సరైన నిఘా వ్యవస్థలేదని.. అవాంఛనీయ సంఘటనలు జరిగే చాన్స్‌ ఉందని ఆ అధికారి లేఖను రాశారు.

Read more: Kiranbedi on rcb stampede: పోలీసుల్ని బలిపశువు చేస్తున్నారు.. చిన్న స్వామి స్టేడియం ఘటనపై కిరణ్ బేడీ సీరియస్..

అంతేకాకుండా.. అదనపు భద్రత సిబ్బంది అవసరమంటూ ఆలేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన.. ఆర్సీబీ కార్యక్రమానికి ముందే సిబ్బంది, పరిపాలన సంస్కరణల కార్యదర్శి జి. సత్యవతితో సహా పలువురు అధికారులకు అసెంబ్లీ భధ్రతను చూసే అధికారులకు లేఖను రాశారు. కానీవారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని స్పష్టంగా తెలుస్తొంది. ఈ లేఖను కనుక కన్సిడర్ చేస్తే.. ఈ రోజు ఇంత పెద్ద దారుణం జరక్కపోయేదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ లేఖ ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు రేపుతుంది. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News