)
Home minister comments on Bengaluru Molestation Case: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడం లేదు. ఆడది కన్పిస్తే చాలు.. పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిర్భయ, పోక్సో వంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా నీచులు మాత్రం తమ వంకర బుద్దిని మార్చుకొవడంలేదు. మొత్తంగా మహిళల వేధింపులు ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరులో సుద్ద గుండెపాల్య ప్రాంతంలో ఒక వీధిగుండా ఇద్దరమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఇంతలో ఒక ఆగంతకుడు రాత్రి పూట వాళ్ల వెనుకాల వచ్చి.. ఒక అమ్మాయిని పక్కకు లాగి.. ఆమె ప్రైవేటు పార్ట్ లను గిల్లి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అసలు ఏంజరుగుతుందో అని ఆ అమ్మాయిలు భయంతో వణికిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. దీనిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Absolutely shameful and deeply disturbing.
This incident isn’t just an attack on one woman — it’s an attack on the very idea of safety in our cities.The fact that such crimes happen in broad daylight in #Bengaluru reflects a serious failure of law & order under the Karnataka gvt pic.twitter.com/FmmqpIl01H— Dr Padma Veerapaneni ( Modi Ka Parivar) (@DrPadmaofficial) April 7, 2025
అయితే... ఇంతలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద నగరాలలో ఇలాంటివి జరుగుతుంటాయన్నారు. అంతేకాకుండా.. మహిళలే కాస్తంత జాగ్రత్తగా ఉండాలన్నట్లు వెటకారంగా మాట్లాడారు. అయిన కూడా పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకొవాలని ఆదేశించినట్లు తెలిపారు. పెట్రోలింగ్ గస్తీని పెంచాలని చెప్పినట్లు కూడా చెప్పారు. అదే విధంగా ఆకతాయిలపై కేసుల్ని నమోదు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఈ క్రమంలో ప్రస్తుతం హోంమంత్రి పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక హోంమంత్రి అయి ఉండి.. ఇంత నీచంగా మాట్లాడమేంటని మండిపడుతున్నారు. వెంటనే దీనిపై హోంమంత్రి పరమేశ్వర మహిళందరికి సారీ చెప్పాలని కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe