Moral policing: మోరల్‌ పోలిసింగ్‌ ఘటన.. హిందూ యువకుడు, ముస్లిం యువతిని వేధించిన 5 మంది అరెస్ట్‌..

Moral Policing Incident in Bengaluru: బెంగళూరులో మోరల్ పోలీసింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని చంద్ర లేఅవుట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయికి వేధింపులు ఎదురవడంతో ఐదుగురిని అరెస్టు చేశారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 11, 2025, 11:22 AM IST
Moral policing: మోరల్‌ పోలిసింగ్‌ ఘటన.. హిందూ యువకుడు, ముస్లిం యువతిని వేధించిన 5 మంది అరెస్ట్‌..

Moral Policing Incident in Bengaluru: ఓ ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయిని వేధించిన ఘటనలో ఐదు మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ మోరల్ పోలీసింగ్ కేసు వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం ఒక హిందూ అబ్బాయి, ఒక ముస్లిం యువతి బుర్కా ధరించి వెళ్తున్నారు. అయితే ద్విచక్ర వాహనంపై ఐదు మంది ముస్లిం యువకులు ఆ ఇద్దరినీ అడ్డుకున్నారు. అమ్మాయిని దుర్భాషలాడారు. అతని బైక్ పై ఎందుకు కూర్చున్నావు ? సిగ్గు లేదా?  మీ కుటుంబం పరువు పోతుంది.

Add Zee News as a Preferred Source

మీ ఇంట్లో వాళ్ల ఫోన్ నెంబర్ ఇవ్వు అని వేధించారు. ఈ నేపథ్యంలో అమ్మాయి కూడా ఇతడు నా క్లాస్ మేట్.. దానికి మా ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఎందుకు ఇవ్వాలి? అని బదులిచ్చింది. దీంతో మాటా మాట పెరిగి పరిస్థితి చేయి దాటింది. అయితే సదరు హిందూ అబ్బాయిపై కూడా ఆ యువకులు దాడి చేశారు. ఇక ఆ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కలిసి వెళుతున్న బైక్ వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి మరింత వేధింపులకు గురి చేశారు.

దీంతో మోరల్ పోలిసింగ్‌లో భాగంగా బెంగళూరులోని  చంద్ర లేఅవుట్ పోలీసులు ఈ ఘటనపై పై సీరియస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు యువకులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ప్రస్తుతం యువకులను దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు సాధారణ జనం తమ చేతుల్లోకి చట్టాలను తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ కేసుపై అరెస్టు చేసిన 5 మందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

READ ALSO:  కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఛాన్స్‌.. ఇలా రూ.10 లక్షలు పొందే అవకాశం..

READ ALSO:  ఆంటీ మీకూ ఇంట్రస్టింగ్‌ రీల్స్‌ పంపిస్తా: హీరో విజయ్‌ దేవరకొండ..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News