)
Bengaluru Jail Scandal Prison Officials Suspended: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీలు మందు పార్టీలు చేసుకొవడం, మొబైల్ ఫోన్ లను ఉపయోగించుకోవడం దేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడంతో ఇది పొలిటికల్ గా కూడా రచ్చగా మారింది. దీనిపై అపోసిషన్ పార్టీలు సీఎం సిద్దరామయ్య సర్కారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. వివాదం మరింత ముదరడంతో సిద్దరామయ్య ఈ వివాదంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Months after the #ParappanaAgrahara central prison came under the spotlight after actor #Darshan was filmed enjoying a luxurious lifestyle, it has now been revealed that several notorious criminals are also getting VIP treatment inside jail. https://t.co/0zw4Otc2Zb pic.twitter.com/WoVTPBW3cH
— Hate Detector 🔍 (@HateDetectors) November 8, 2025
దీనిలో భాగంగా.. జైలు చీఫ్ సూపరింటెండెంట్‌ను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా.. మరో ఇద్దరు జైలు అధికారులను వారి బాధ్యతల నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వైరల్ గా మారిన వీడియోల్లో.. ఖైదీలు ఏకంగా మద్యం పార్టీ చేసుకుంటూ, డ్యాన్సులు చేస్తూ సరదాగా గడుపుతూ కనిపించడంతో పెనుదుమారంగా మారింది.
అత్యాచారం, హత్యలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలకు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కూడా ఇదే జైలులో ఉండగా.. అప్పట్లో అతడికి జైలు అధికారులు అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జైలు ఆవరణలో కొంతమంది ఖైదీలతో దర్శన్ తో బాతాఖానీ వేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజా వివాదంలో మరోసారి పరప్పన జైలు కాంట్రవర్సీగా మారింది.
కర్ణాటక అసెంబ్లీ, బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక జైళ్లు సిద్ధరామయ్య జైళ్లుగా మారుతున్నాయని, ఉగ్రవాదులకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దీనిపైన NIA లేదా CBI దర్యాప్తు జరిపించాలన్నారు.
అదే విధంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఈ ఉగ్రవాదులు జైలులో అన్ని సౌకర్యాలు పొందుతున్నారని బీజేపీ నేత సీటీ రవి ఏకీపారేశారు. దీనిపై వెంటనే బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook