)
Couple Killed Delivery Agent With Car Video: చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలకు దిగుతూ రోడ్లపై రచ్చ జరిగే అనేక ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా ఒక డెలివరీ ఏజెంట్ ప్రాణాలను తీసింది గొడవ. కేవలం కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలిందనే గొడవ చిలికి చిలికి గాలి వాన అయి వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఈ నెల 22న అర్ధరాత్రి చోటు చేసుకుంది. బైక్ పై తన స్నేహితుడితో కలిసి దర్శన్ అనే వ్యక్తి కి వెళ్తున్నారు. అయితే పక్కనే కారులో మనోజ్ కుమార్, ఆరతి శర్మ అనే జంట కూడా రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. అయితే సైడ్ మిర్రర్ కి బైక్ తాకిందని మొదటగా భార్య గొడవ చేసింది. ఆ వ్యక్తిని రెండు కిలోమీటర్లు వెంటాడి కారుతో గుద్ది చంపేశారు. తీవ్ర గాయాల పాలైన దర్శన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించగానే ఆయన అప్పటికే చనిపోయారు. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో లభించింది.
बेंगलूरु की घटना। कैसे पति-पत्नी ने डिलीवरी एजेंट को कुचल कर मार दिया।
दोनों अरेस्ट हो चुके हैं pic.twitter.com/bJ6EsdPgs9— Narendra Nath Mishra (@iamnarendranath) October 29, 2025
పోలీసుల వివరాల ప్రకారం కలియారుపట్టు ట్రైనర్ మనోజ్ కుమార్ (32) కేరళకు చెందినవారు. ఇక ఆయన భార్య జమ్ముకు చెందిన అరతి శర్మకు ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరిద్దరూ కలిసి దర్శన్‌ను చంపారు. ఇక దర్శన్ అనే డెలివరీ ఏజెంట్ స్థానికంగా తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇక దర్శన్ సోదరి జెపి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు స్థానికంగా సీసీ టీవీ ఫుటేజీ సేకరించి దారుణానికి ఒడిగట్టిన దంపతులను అరెస్టు చేశారు. ఫుటేజ్ లో దారుణ ఘటన రాత్రి 9:40 గంటల సమయంలో జరిగింది. దంపతులు ఇద్దరు మాస్కులు వేసుకొని రోడ్డు పైకి వచ్చి తమ కార్ తో ఢీ కొట్టిన తర్వాత రోడ్డుపై పడిన తమ కారు విడిభాగాలను తీసుకొని మళ్లీ కారు ఎక్కి వెళ్లిపోయారు. బుధవారం సదరు దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కూడా విధించింది కోర్టు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook