)
Bengaluru Shop owner brutally kicks and drags woman video: మహిళల భద్రత, వారి గౌరవం కాపాడటం కోసం దేశంలో అనేక చట్టాలున్నాయి. కానీ ఇటీవల కొంత మంది మహిళలు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.. మరీ క్రైమ్ లో కూడా ఎందుకు పోటీ ఇవ్వకూడదని అనుకుంటున్నారో ఏంటో కానీ.. మొత్తంగా కొంత మంది ప్రవర్తన మరీ దారుణంగా ఉంటుంది.
ఈ క్రమంలో కొంత మంది మహిళలు తరచుగా చేస్తున్న కాంట్రవర్సీల కారణంగా.. మొత్తంగా మహిళ సమాజానికే చెడ్డపేరు వస్తుంది. తాజాగా.. బెంగళూరులో ఒక మహిళ షాపులో కాస్లీ చీరలు కాజేసింది. ఇది కాస్త దాని ఓనర్ చూడటంతో పెద్ద రచ్చగా మారింది.
బెంగుళూరులో అమానుష ఘటన
చీరలు దొంగలించిందని తెలుగు మహిళను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టిన షాపు యజమాని
కర్ణాటక–బెంగుళూరులోని అవెన్యూ రోడ్డులో ఉన్న మియా సిల్క్ శారీస్ అనే దుకాణంలో రూ.91,500 విలువ గల చీరల కట్టను దొంగలించిన తెలుగు మహిళ
సీసీటీవీ ఫుటేజీలో ఈ విషయం గమనించి,… pic.twitter.com/4E68zBUGiX
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2025
బెంగళూరులోని చిక్‌పేట్‌లోని కరూర్ వైశ్యా బ్యాంక్ సమీపంలో ఉమేద్ రామ్ అనే వ్యక్తి మాయ సిల్క్ చీరల షాపు నడుపుతున్నాడు.ఈ క్రమంలో ఇటీవల ఒక మహిళ..తన షాపు నుంచి రూ.91,500 కాస్లీ చీరల కట్టల్ని చోరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అప్పగించాడు.
అయితే.. ఆ మరుసటి రోజు అదే ప్రాంతానికి దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ తిరిగి రావడంతో.. చీరల షాపు యజమాని ఆమెతో వాగ్వాదంకు దిగాడు.అంతే కాకుండా రోడ్డుపైకి ఈడ్చుకుంటూ లాక్కెళ్లి, కడుపులో, ప్రైవేటు పార్ట్ పై తన్నుతూ దాడి చేశాడు. అక్కడున్న వారు ఆపేందుకు ప్రయత్నించిన అతను వెనక్కు తగ్గలేదు.
అయితే.. కొంత మంది ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చీరలు చోరీచేయడం తప్పే..?.. కానీ కాలితో తన్నడం, ఆమెపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
మహిళపై అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడేంటీ..?.. అసలు వాడు మనిషేనా .. అంటూ మరికొంత మంది ఫైర్ అవుతున్నారు. వెంటనే అతనిపై పోలీసులు చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరొవైపు పోలీసులు రంగంలోకిదిగి షాపు ఓనర్ పై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook