Bengaluru stampede case: ఆర్సీబీ ఘటనలో బిగ్ ట్విస్ట్.. సీఎం సిద్దరామయ్య, గవర్నర్ ల మధ్య రాజుకున్న చిచ్చు..

Rcb parade stampede: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం విధానసౌధ వర్సెస్ రాజ్ భవన్ గా మారిపొయిది. దీనిపై గవర్నర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 10, 2025, 07:09 PM IST
  • కన్నడ నాటు ముదురుతున్న వివాదం..
  • విధాన సౌధ వర్సెస్ రాజ్ భవన్..
Bengaluru stampede case: ఆర్సీబీ ఘటనలో బిగ్ ట్విస్ట్.. సీఎం సిద్దరామయ్య, గవర్నర్ ల మధ్య రాజుకున్న చిచ్చు..

Bengaluru stampede case karnataka cm siddaramaiah vs governor: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో దాదాపు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్ ను తొలిసారి సాధించిన ఆర్సీబీ టీమ్ కు సన్మాన కార్యక్రమంకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో దీనికి భారీగా ఆర్సీబీ అభిమానులు తరలివచ్చారు . స్టేడియం కెపాసిటీకి మించి భారీగా అభిమానులు రావడంతో తీవ్రమై తోపులాట జరిగింది. అక్కడున్న సిబ్బంది సైతం చేతులెత్తేశారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో తొక్కిసలాటలో 11 మంది మరణించగా..  50 మందికి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కన్నడ నాట పెనుదుమారంగా మారింది. దీనిపై ప్రస్తుతం రోజుకో ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో గురించి నాకు సడెన్ గా ఇన్విటేషన్ వచ్చిందన్నారు.

గవర్నర్ వస్తున్నారని నిర్వాహాకులు చెబితే తాను వెళ్లేందుకు సిద్దమైనట్లు సిద్దరామయ్య మాట్లాడారు. ఈ కామెంట్స్ పై తాజాగా.. రాజ్ భవన్ వర్గాలు కౌంటర్ ఇచ్చాయి.  సీఎం ఆహ్వానిస్తేనే విధాన సౌధాలో జరిగిన ఆర్సీబీ ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ వెళ్లారని రాజ్ భవన్ స్పష్టం చేసింది. విధాన సౌధలో సీఎం సిద్దారామయ్య కార్యక్రమం ఏర్పాటు చేయలేదనడం హస్యాస్పదంగా ఉందన్నారు.
 
మొదట ఆర్సీబీ జట్టు ఆటగాళ్లకు రాజ్‌భవన్‌లోనే ఆతిథ్యం ఇవ్వాలని భావించారని.. ఆతర్వాత విధాన సౌధలో నిర్వహించారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇటీవల చిన్నస్వామి స్టేడియం ఘటనకు ముందు డీసీపీ  కరిబసవన గౌడ ప్రభుత్వంతో పాటు, ఇతర ఉన్నతాధికారులకు ఆర్సీబీ ఈవెంట్ గురించి లేఖను రాశారు.

Read more: Bengaluru Stampede: చిన్నస్వామి ఘటనలో బిగ్ ట్విస్ట్.. ముందే హెచ్చరిస్తు సర్కారుకు లేఖ రాసిన సీనియర్ పోలీసు.. వెలుగులోకి షాకింగ్ నిజం..

ఆర్సీబీకి అదనపు భద్రత అవసరమంటూ, పరిపాలన సంస్కరణల కార్యదర్శి జి. సత్యవతితో సహా పలువురు అధికారులకు అసెంబ్లీ భధ్రతను చూసే అధికారులకు లేఖను రాశారు. ఈ లేఖను అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం విధాన సౌధ వర్సెస్ రాజ్ భవన్ అంశం కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News