Bengaluru teacher sridevi hudagi honey trap case: సాధారణంగా తల్లి,తండ్రి, ఆ తర్వాత గురువుకు గొప్ప స్థానం ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు గురువులు మంచి విద్యను అందించి.. సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతారని భావిస్తారు. తమ పిల్లకు మంచి క్వాలీటీ ఎడ్యూకేషన్ కోసం ఎంతైక ఖర్చులు చేసేందుకు అస్సలు వెనక్కు రారు. కానీ కొందరు కామాంధులు మాత్రం పవిత్రమైన ఉపాధ్యాయవృత్తిలో ఉండి కూడా.. నీచపు పనులు చేస్తున్నారు. కొంత మంది తప్పతాగి క్లాసులకు వస్తున్నారు. మరికొందరు తమ విద్యార్థులతో రోమాన్స్ చేస్తున్నారు.
ఇంకొందరు తమ తోటీ టీచర్ లతో ఆఫీసుల్లోనే రాసలీలల్లో మునిగిపోతున్నారు. ఇటీవల స్కూళ్లలో టీచర్ లు, ఉపాధ్యాయుల రోమాన్స్ ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. అయితే.. బెంగళూరులో ఒక లేడీ టీచర్ ఘటన ప్రస్తుతం అందరిని నివ్వెరపోయేలా చేసింది. బెంగళూరులో ప్రీస్కూల్ లో టీచర్ గా శ్రీదేవీ రుడాగి పనిచేస్తుంది. ఆమె ఆ స్కూల్ లోని పిల్లల తండ్రులతో చనువుగా ఉండేది. ఈ క్రమంలో ఆమె గతంలో బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మెన్ తో పరిచయం పెంచుకుంది.
ఇద్దరు కూడా తరచుగా ఫోన్స్ , వాట్సాప్ లు చేసుకునే వారు. గతంలో తన తల్లికి సర్జీరీ ఉందని చెప్పి ఆయన దగ్గర నుంచి 5 లక్షలు తీసుకుంది. ఎన్నిసార్లు అడిగిన కూడా ఫోన్ లలో హస్కీగా మాట్లాడుతూ.. ముద్దులు పెడుతూ.. అతడ్ని ఏమార్చేది. ఇదే విధంగా ఇప్పటి వరకు 10 లక్షల వరకు దండుకుంది. ఇంకా అతను లేడీ టీచర్ యవ్వారం గురించి తెలుసుకున్నాడు. తను ఇచ్చిన డబ్బుల్ని ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కిలేడీ టీచర్ రివర్స్ లోచుక్కలు చూపించింది.
ఇప్పటి వరకు తనతో దిగిన రోమాన్స్ ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని.. నీ భార్యకు,కుటుంబానికి చూపిస్తానని ఆమె బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో మరో ఇద్దరితో కలిసి కూడా 15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. సాగర్ మోరే, గణేష్ కాలే లను రంగంలోకి దించి వారితో బెదిరింపులకు పాల్పడింది. మొత్తంగా సదరు కిలేడీ అతడ్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఇంకా ఆ వేధింపులు తాళలేక. వారి దగ్గర నుంచి తప్పించుకుని వచ్చి స్థానికంగా ఉన్న పీఎస్ లోబాధితుడు ఫిర్యాదు చేశాడు.
Read more: Samantha: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన సమంత.. టైమ్ చూసి భలే దెబ్బ కొట్టిందిగా..!..
ఈక్రమంలో పోలీసులు యువతిని మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. యువతి గతంలో కూడా పలుమార్లు ఇదే విధంగా చాలా మందిని ముగ్గులోకి దింపి.. డబ్బులు దండుకుందని విచారణలో తెలింది. ఈ ఘటన ప్రస్తుతం బెంగళూరులో సంచలనంగా మారింది. దీనిపైన పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









