Jio vs Airtel Plan: జియో వర్సెస్ ఎయిర్‌టెల్‌లో ఏ ప్లాన్ బెస్ట్, ఎందులో ఎక్కువ ప్రయోజనాలు

Jio vs Airtel Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీల్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటోంది. రెండు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్రీ పెయిడ్ ప్లాన్స్ అందిస్తుంటాయి. ఈ క్రమంలో ఏది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2025, 09:51 PM IST
Jio vs Airtel Plan: జియో వర్సెస్ ఎయిర్‌టెల్‌లో ఏ ప్లాన్ బెస్ట్, ఎందులో ఎక్కువ ప్రయోజనాలు

Jio vs Airtel Plan: ఇతర టెలీకం కంపెనీలతో పోలిస్తే రిలయన్స్ జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో ప్లాన్ చాలా బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. 98 రోజులు పనిచేస్తుంది. జియో వర్సెస్ ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ ప్లాన్ గురించి పరిశీలిద్దాం.

Add Zee News as a Preferred Source

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తక్కువ ధరకు వివిధ రకాల ప్రీ పెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్‌తో పాటు అపరిమితమైన డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, లాంగ్ వ్యాలిడిటీ లభిస్తాయి. ఎయిర్‌టెల్ ప్లాన్‌తో పోలిస్తే జియో ప్లాన్‌‌ 14 రోజులు అదనంగా, 30 రూపాయలు తక్కువగా ఉంటాయి. ఈ ప్లాన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 999 రూపాయలకు ఒక ప్లాన్ ఉంటే 979 రూపాయలకు మరో ప్లాన్ లభిస్తుంది. దాదాపు 100 రోజుల వ్యాలిడిటీ కావాలనుకుంటే జియో ప్లాన్ బెస్ట్ ఆప్షన్ కాగలదు. ఇక 20 రూపాయలు తక్కువ ఖర్చుతో అయితే ఎయిర్‌టెల్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీకు లభిస్తుంది. రెండు ప్లాన్స్ మధ్య పెద్దగా అంతరం లేదనే చెప్పాలి. 

ఎయిర్‌టెల్ 979 రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ అందిస్తున్న 979 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 10 ఎస్ఎంఎస్‌లతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం వెర్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో 22 ఓటీటీ సేవలు ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా ఎయిర్‌టెల్ థ్యాంక్స్, ఉచిత హెలోట్యూన్స్ సేవలు అందుతాయి. అన్‌లిమిటెడ్ 5జి డేటా ఉంటుంది. 

జియో 999 రూపాయల రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. మీ ఫోన్ 5జి సపోర్ట్ చేస్తే అన్‌లిమిటెడ్ 5జి డేటా పొందవచ్చు. అంతేకాకుండా జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి. 

Also read: Team India Schedule: టీమ్ ఇండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇంగ్లండ్ సిరీస్ తరువాత రెస్ట్ ఉందా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News