Best Recharge Plans: రోజూ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 2 నెలల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్

Best Recharge Plans: దేశంలోని నాలుగు టెలీకం కంపెనీలు వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. దీర్ఘకాలం వ్యాలిడిటీ ప్లాన్లకు ఆదరణ ఎక్కువ. అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్స్ కోసం యూజర్లు చూస్తున్నారు. మీ కోసం బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2025, 05:55 PM IST
Best Recharge Plans: రోజూ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 2 నెలల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్

Best Recharge Plans: ప్రస్తుతం చాలా రకాల రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్లాన్స్ డేటా అత్యధికంగా ఇస్తే మరికొన్ని లాంగ్ వ్యాలిడిటీ ఇస్తుంటారు. ఇంకొన్ని కేవలం వాయిస్ కాలింగ్ అందిస్తుంటాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా,బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

అతి తక్కువ ధరలో రెండు నెలల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు అన్నీ 2 నెలల వ్యాలిడిటీ ప్లాన్స్ అందిస్తున్నాయి. 345 రూపాయల నుంచి ఈ ప్లాన్స్ ప్రారంభమౌతాయి.బీఎస్ఎన్ఎల్ 345 రూపాయల రీఛార్జ్ ప్లాన్ మొత్తం 60 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో రోజుకు 1జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనం ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. బీఎస్ఎన్ఎల్‌లోనే మరో ప్లాన్ 347 రూపాయలకు ఉంది. ఈ ప్లాన్ 56 రోజులకు ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది.రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. 

ఇక రిలయన్స్ జియోలో 579 రూపాయల ప్లాన్ ఉంది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. 56రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 

ఇక ఎయిర్‌టెల్‌లో రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్ 619 రూపాయలు మాత్రమే. 60 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఉచిత ఎస్ఎంఎస్‌ల ప్రయోజనం కలుగుతుంది. ఎయిర్‌టెల్ 649 రూపాయల రీఛార్జ్  56 రోజులు పనిచేస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. 

Also read: NEET UG 2025 City Intimation: నీట్ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News