Pahalgam Terror Attack: భూతల స్వర్గంగా పేరొందిన కశ్మీర్ లోయ రక్తసిక్తమయ్యింది. సుందర కాశ్మీర అందాలను చూద్దామని వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాద ముష్కర మూకలు చేసిన దాడిలో 26 మంది మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయాలు పాలయ్యారు. అయితే మృతి చెందిన కుటుంబాలకు ఈ ఘటన ఎనలేని శోకాన్ని మిగిలించింది. ఒక్కొక్కరి దీనగాధ బయటకు వచ్చే కొద్దీ సగటు భారతీయులు శోకతప్త హృదయంతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పహల్గాం ఉగ్రవాద దాడి ఎంతోమంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
పసి పిల్లల ముందే కరుడుగట్టిన ఉగ్రవాదులు పాషవికంగా ప్రవర్తించి వేడుకున్న కనికరించకుండా కుటుంబ సభ్యుల ముందే అనేక మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. బాధితులది ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాధ డాక్టర్ సుజాత భూషణ్ తన దీన గాధ చెబుతూ తన భర్త భరత్ భూషణ్ చనిపోయే ముందు తనకు మూడేళ్ల పిల్లవాడు ఉన్నాడని అతనిని చూసైనా కనికరించి తనను వదిలేయాలని నిస్సహాయంగా ఉగ్రవాదిని వేడుకున్నప్పటికీ పాశవికంగా అతని కుటుంబ సభ్యుల ముందే అతనిలో శరీరంలో బుల్లెట్లు దింపి ప్రాణం తీశాడు. మృతుడు భరత్ భూషణ్ దీనగాధ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉంది. కళ్ళముందే భవిష్యత్తు అంధకారం అవడంతో ఆ కుటుంబం ఇప్పుడు తీరని వేదనలో కూరుకుపోయింది.
మినీ స్విట్జర్లాండ్ గా పేరు పొందినటువంటి పెహల్గామ్ లోని బైసరం లోయలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి 26 మందిని బలిగొన్నారు. ఈ దాడి సమయంలో మృతుడు భరత్ భూషణ్ తన భార్య మూడేళ్ల కుమారుడితో బైసరన్ లోయలో విహరిస్తున్నాడు. కానీ ఆ పర్యటన అతని జీవితంలో చివరి క్షణం అవుతుందని ఊహించలేకపోయాడు.
భర్త మరణాన్ని కళ్లారా చూసిన భార్య సుజాత మాట్లాడుతూ ఏప్రిల్ 18వ తేదీన తమ కుటుంబం కాశ్మీర్ కు పర్యటన కోసం వెళ్ళిందని పహల్గామ్ ట్రిప్ లో చివరి ప్రాంతం ఈ బైసరన్ లోయ అని అక్కడ గుర్రాలపై చేరుకొని కశ్మీరీ సాంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు తీసుకున్నామని తమ బిడ్డతో ఆడుకుందామని పేర్కొన్నారు. అంతలోనే తుపాకుల శబ్దం వినిపించిందని ఏమైందో అని కళ్ళు తెరిచి చూసే లోగా అంతా రక్తసిక్తం అయిందని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు పారిపోవడానికి, తలదాచుకోవడానికి చోటులేక పోయింది.
బాధితురాలు డాక్టర్ సుజాత మాట్లాడుతూ - ఉగ్రవాదుల దాడి జరిగే సమయంలో దాక్కునేందుకు ప్లేస్ లేదని. బైసరన్ ఓ పెద్ద మైదానమని, తాము మైదానం మధ్యలో ఉన్నామని, పరిగెత్తుకుంటూ మైదానంలో ఉన్న. టెంట్ల వెనక్కి వెళ్లి దాక్కున్నామని తెలిపారు. అయినా మేము అక్కడ జరుగుతున్న దుశ్చర్యలను కళ్లారా చూస్తూనే ఉన్నామని తెలిపారు. ఉగ్రవాదులు ఒక్కొక్కరినీ టెంటు బయటకు లాగి ప్రశ్నించి మరీ, కాల్చేస్తున్నారు. మా టెంట్ దగ్గర్లో ఉన్న ఓ ఉగ్రవాది మా పిల్లలు బాధపడుతుంటే మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?' అని.గద్దించినట్లు ఆమె తెలిపింది.
చివరగా ఒక ఉగ్రవాది తన భర్త వద్దకు వచ్చి, ఏ ప్రశ్నలు లేకుండా తన భర్తను కాల్చేశాడని రోదించింది. కాల్చే ముందు. నా భర్త, ‘నాకు ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు… వదిలేయండి’ అని వేడుకున్నా. కానీ అతడిలో కనికరం కలగలేదు," అని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి గాథ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









