)
Power Star Wife Controversy: నిత్యం వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచే వ్యక్తిగా భోజ్ పురి నటుడు కమ్ సింగర్ పవన్ సింగ్ కు పేరుంది. అపుడపుడు ఇతను పబ్లిక్ గా హీరోయిన్స్ నడుము పట్టుకోవడం.. ముద్దు పెట్టుకోవడం పనులతో ఇతను వివాదాస్పద నటుడిగా పేరు పడ్డారు. ఇతనికి ఇద్దరు భార్యలున్నాయి. తాజాగా ఇతన్ని కలవడానికి అతని రెండో భార్య జ్యోతి సింగ్.. లక్నోలోని అతని ఇంటికి వచ్చినపుడు .. ఆమె తన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చిందంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు పవన్ సింగ్. దీంతో లేడీ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమె ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. తన ఇంట్లో తన భర్తను కలవకుండా చేస్తున్నారంటూ కన్నీరు మున్నీరు అయింది. అంతేకాదు తన భర్తతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ తనను కొన్ని రోజులుగా వేధిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తనను తన భర్త ఇంటి నుంచి అత్యంత అవమానకరంగా పోలీసులతో బయటకు ఈడ్చుకు వెళ్లడంపై ఒకింత భావోద్వేగానికి గురైంది. దానికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అంతేకాదు గత కొన్ని రోజులుగా తను ఎలా వేధింపులకు గురవుతున్నానే విషయాన్ని ప్రస్తావించింది జ్యోతి సింగ్. తన భర్తను కలవడానికి అతని ఇంటికి వెళ్తే కనీసం తనతో మాట్లాడుకుండా అత్యంత అవమానకరంగా పోలీసులతో ఇంట్లోంచి వెళ్లగొట్టారని చెప్పుకొచ్చింది.అం తకు ముందు ఇన్స్టాన్గ్రామ్ లో తన భర్త పవన్ సింగ్ పేరు ప్రస్తావిస్తూ.. రేపు మిమ్నల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ను కలవడానికి లక్నోలోని మీ ఇంటికి వస్తున్నాను. అక్కడ మీరు నన్ను కలుస్తారని అనుకుంటున్నాను అని అందులో ఉంది. అయితే ఆదివారం తన భర్త పవన్ సింగ్ ను కలవడానికి వచ్చినపుడు.. పవన్ సింగ్ ముందస్తుగా తన భార్య తనను వేధించడానికి వచ్చిందని చెప్పి తన భార్య నుంచి తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో లేడీ పోలీసులు లక్నో లోని పవన్ సింగ్ ఇంట్లో రంగ ప్రవేశం చేయడంతో అక్కడ జ్యోతి సింగ్ తో పోలీసుల వాగ్వాదంతో పవన్ ఇంట్లో పెద్ద హై డ్రామానే నడిచింది.
నేను మిమ్మల్ని కలవాడినికి వస్తే.. పోలీసులు తనను నెట్టేస్తున్నరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. పోలీసులు అడ్డుగా ఉండి మిమ్మల్ని కలవనీయడం లేదు. ఇపుడు నేను ఏమి చేయాలో చెప్పండి అంటూ భోజ్ పురి ప్రజలను కన్నీళ్లతో వేడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నన్ను ఏ కేసులో ఇక్కడ నుంచి తీసుకెళ్లడానికి వచ్చారో చెప్పాలని పోలీసులపై ఫైర్ అయింది. గత కొన్నేళ్లుగా పవన్ సింగ్ కు అతని భార్య జ్యోతి సింగ్ పెద్దగా సంబంధాలు లేవు. అతను తన భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకెక్కారు. ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు పెండింగ్ లో ఉంది. అయితే.. భర్తతో తనకు విడాకులు వద్దని కోరుతూ లక్నోలోని తన భర్త ఇంటికి చేరుకోవడంతో ఇంత హై డ్రామా జరిగింది. మరి ఈ వ్యవహారం చివరకు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.