Unified Pension Scheme: ఈ నెల 30 వరకే డెడ్‌ లైన్.. యూపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు ఇవే..!

NPS to UPS Deadline: యూపీఎస్‌లో చేరేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 30వ తేదీ వరకు సమయం ఉంది. అయితే ఇంకా చాలా సందేహాలు అలాగే ఉండిపోవడంతో చాలా మంది ఉద్యోగులు యూపీఎస్ పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 23, 2025, 01:22 PM IST
Unified Pension Scheme: ఈ నెల 30 వరకే డెడ్‌ లైన్.. యూపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు ఇవే..!

NPS to UPS Deadline: పదవీ విరమణ తరువాత తమకు కచ్చితమైన పెన్షన్ ఇచ్చే పాత పింఛన్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో.. మోదీ సర్కారు యూనిఫైడ్‌ పింఛను పథకం (UPS)ను తీసుకువచ్చింది. ఉద్యోగులు కావాలనుకుంటే జాతీయ పింఛను పథకం (NPS)లో కొనసాగొచ్చు. లేదంటే యూపీఎస్‌లో చేరొచ్చు. యూపీఎస్‌లో చేరేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 28వ తేదీలోగా ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యూపీఎస్‌పై అనేక సందేహాలు మిగిలిపోవడంతో ఉద్యోగులు సందిగ్ధంలో పడిపోయారు. ఒక్కసారి యూపీఎస్‌లో చేరితే.. మళ్లీ ఎన్‌పీఎస్‌కు మారే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి పెన్షన్‌కు కనీస సర్వీస్, అడ్వాన్స్ విత్ డ్రాలపై ఆంక్షలు, బెంచ్ మార్క్ కార్పస్ ఫండ్ తదితర అంశాలపై స్పష్టమైన వివరణలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు.

Add Zee News as a Preferred Source

OPS, NPS రెండు స్కీమ్స్‌లో ప్రయోజనాలను కలిపి OPSను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎన్‌పీఎస్ కింద ఈక్విటీ, లోన్ పెట్టుబడుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అధిక పెన్షన్లను పొందే అవకాశం ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో పదవీ విరమణ తర్వాత గ్యారంటీ పెన్షన్‌ లభిస్తుంది. ఇక UPS విషయానికి వస్తే.. రిటైర్‌మెంట్ తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నిబంధనలు రూపొందించారు. ఈ స్కీమ్‌ కింద చేరిన ఉద్యోగులు.. కనీసం 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంటే.. వారి సగటు ప్రాథమిక జీతంలో 50 శాతం (పదవీ విరమణకు ముందు 12 నెలల నుంచి) పెన్షన్‌గా పొందుతారు. అయితే 25 ఏళ్ల సర్వీస్ కంటే తక్కువ సర్వీస్‌తో ముందే రిటైర్ అయినా.. వాలంటరీ రిటైర్‌మెంట్ అయినా.. పెన్షన్‌లో కోత పడుతుంది. 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయడంతోపాటు కార్పస్ ఫండ్ నుంచి పాక్షికంగా విత్ డ్రా చేయకుండా, డిఫాల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే పూర్తి పెన్షన్‌కు అర్హులు అవుతారు. పెన్షన్ పొందేందుకు అర్హుత సాధించాలంటే.. కనీసం పదేళ్ల సర్వీస్ కచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

యూనిఫైడ్‌ పెన్షన్ స్కీమ్‌లో చేరిన ఉద్యోగులు.. తమ శాలరీ నుంచి 10 శాతం కార్పస్ ఫండ్‌కు జమ చేస్తే, కేంద్రం 18 శాతం జమ చేస్తుంది. ఈ మొత్తం డబ్బులను NPSలో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే అవసరాల కోసం ఫండ్‌ నుంచి విత్ డ్రా చేసుకుంటే.. పెన్షన్‌లో కోత పడుతుంది. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి.. రూ.45 వేలు జీతం అందుకుంటే, రూ.22,500 పెన్షన్ పొందుతారు. ఒకవేళ కార్పస్ ఫండ్‌ నుంచి విత్ డ్రా చేసుకుని ఉంటే.. ఆ మేరకు పెన్షన్‌ లెక్కింపు చేసి తగ్గిస్తారు.

అయితే చాలా మంది ఉద్యోగులు UPSలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. NPS లో కనీసం 60 శాతం ఫండ్‌ని వెనక్కు తీసుకునే అవకాశ ఉంది. కానీ UPS లో ఆ అప్షన్‌ లేదు. ఒకవేళ విత్ డ్రా చేసుకుంటే పెన్షన్‌లో కోత పడుతుంది. రిటైర్‌మెంట్ తరువాత పే అవుట్‌ను పెన్షన్‌గా పరిగణించడం లేదు. అదేవిధంగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను ఎలా లెక్కిస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ఉద్యోగి జీతం నుంచి చెల్లించిన 10 శాతం నగదు మళ్లీ వెనక్కి రాదు. ఉద్యోగి వాటా నుంచి పెన్షన్ లెక్కిస్తే.. రిటైర్‌మెంట్ తరువాత తమకు గ్రాట్యూటీ తప్ప ఇంకేమి మిగలదని ఉద్యోగులు అంటున్నారు. 

Also Read: Strait of Hormuz : హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసిన ఇరాన్.. భారత్ పై  ప్రభావం ఎంత.. !

Also Read: FD Scheme: ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టి చూడండి.. లక్షల్లో లాభాలు ఖాయం..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News