Ration Card eKYC: మీ రేషన్ కార్డు ఇకేవైసీ పూర్తయిందా ఏప్రిల్ 30వరకే గడువు జాగ్రత్త

Ration Card eKYC: రేషన్ కార్డులకు సంబంధించి కీలకమైన్ అప్‌డేట్ వెలువడింది. మీ రేషన్ కార్డు ఈ కేవైసీ స్టేటస్ ఓసారి చెక్ చేసుకోవాలి. పెండింగ్ ఉంటే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ రేషన్ కార్డు రద్దయిపోతుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 9, 2025, 05:07 PM IST
Ration Card eKYC: మీ రేషన్ కార్డు ఇకేవైసీ పూర్తయిందా ఏప్రిల్ 30వరకే గడువు జాగ్రత్త

Ration Card eKYC: కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల అమలకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక ప్రామాణికం రేషన్ కార్డు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఐదేళ్లకోసారి రేషన్ కార్డు అప్‌డేట్ అవసరం. దీనికోసం ఈ కేవైసీ తప్పకుండా చేసుకోవాలి. మీరు కూడా మీ రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేయకుంటే ఆ కార్డు రద్దయిపోతుంది. 

Add Zee News as a Preferred Source

మీ రేషన్ కార్డు ఈ కేవైసీ స్టేటస్ సంబంధిత రేషన్ డీలర్ వద్ద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఐదేళ్లకోసారి రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవాలి. చిన్నపిల్లల్ని అందులో చేర్చడం, ఎవరైనా మరణిస్తే ఆ పేర్లు తొలగించడం చేస్తుండాలి. అడ్రస్ మారితే ఆన్‌లైన్‌లో కూడా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ప్రతి రేషన్ డీలర్ వద్ద ఉండే ఈ పోస్ పరికరం ద్వారా ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేయవచ్చు. అందులో రెడ్ కలర్ పట్టీలో పేర్లు ఉంటే ఈ కేవైసీ పెండింగులో ఉందని అర్ధం. అదే గ్రీన్ రంగులో ఉంటే ఈ కేవైసీ పూర్తయిపోయినట్టు. రెడ్ కలర్‌లో ఉంటే వేలి ముద్ర వేయడం ద్వారా ఈ కేవైసీ పూర్తవుతుంది. 

ఆన్‌లైన్‌లో కూడా ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. గూగుల్ బ్రౌజర్‌లో EPDS1 టైప్ చేసి ఎంటర్ నొక్కితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్ ఏపీ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రేషన్ కార్డు విభాగంలో 6 ఆప్షన్లు కన్పిస్తాయి. వాటిలో EPDS Application Search / Rice Card Search క్లిక్ చేసి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతే స్క్రీన్‌పై పేర్లు కన్పిస్తాయి. ఆ పేర్లకు ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని ఉంటే ఈకేవైసీ పూర్తయినట్టు అర్ధం. లేదంటే ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

మీ సంబంధిత రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈ పోస్ పరికరంలో వేలిముద్ర వేస్తే చాలు..ఆ ప్రక్రియ పూర్తయినట్టే. ఏప్రిల్ 30 దీనికి చివరి తేదీ. ఆలోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకపోతే మీ రేషన్ కార్డు హోల్డ్ కాగలదు లేదా రద్దు కాగలదు.

Also read: New Ration Card: కొత్త రేషన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి, ఏమేం డాక్యుమెంట్లు కావాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News