Pan Card Alert: అందుకే పాన్‌కార్డు వినియోగదారులు తమ పాన్‌కార్డును ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి. పాన్‌కార్డు విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. పాన్‌కార్డుకు సంబంధించి ఈ కీలకమైన ప్రక్రియ పూర్తి చేయకుంటే తక్షణం పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
వాస్తవానికి పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సిందిగా ఎప్పుడో ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించిన గడువు తేదీ కూడా చాలా సార్లు పొడిగించారు. నగదు సంబంధిత లావాదేవీలకు పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి చాలా సార్లు ఈ విషయమై అలర్ట్ జారీ అయింది. పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు మరోసారి చివరి గడువు విధించింది ఇన్‌కంటాక్స్ శాఖ. 2025 డిసెంబర్ 31 నాటికి ఆధార్ కార్డుతో పాన్‌కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారింది.
ఆధార్ కార్డుతో పాన్‌కార్డు అనుసంధానం చేయకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. అంటే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ అయిపోతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం, రిఫండ్ క్లెయిమింగ్ సాధ్యం కాదు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫామ్ 15జి, ఫామ్ 15హెచ్ సబ్‌మిట్ చేయడం సాధ్యం కాదు. ఫామ్ 26 ఏఎస్‌లో టీడీఎస్ క్రెడిట్ కన్పించదు. ఇలా అన్నింటిపై పాన్ కార్డు ప్రభావం చూపిస్తుంది.
2024 అక్టోబర్ 1 కంటే ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ కార్డు పొందినవాళ్లు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. 2025 డిసెంబర్ 31లోగా పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో 2023 జూన్ 30 వరకూ ఈ గడువు ఉండేది. ఆ తరువాత ప్రతిసారీ పొడిగిస్తూ వచ్చారు. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం చాలా సులభం. ముందుగా ఇన్‌కంటాక్స్ ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. పాన్ కార్డు-ఆధార్ కార్డు లింకింగ్ ప్రక్రియను ఫాలో అవాలి. డేటాలో తేడా ఉంటే మాత్రం బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో ఓటీటీ ధృవీకరణ ఆప్షన్ కూడా ఉంది.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో కాకుండా మిగిలినవారికి జరిమానా 1000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. పాన్ కార్డు-ఆధార్ కార్డు లింకింగ్ ద్వారా ట్యాక్స్ ఎగవేతను అరికట్టవచ్చు. ఎన్‌రోల్మెంట్ ఐడీతో జారీ అయినా పాన్ కార్డుల్ని ఒరిజినల్ ఆధార్ కార్డుతో అప్‌డేట్ చేయడం ద్వారా డేటాలో ఆక్యురెసీ పెరుగుతుంది.
Also read: AP Rain Alert: ఏపీలో మరో ఐదు రోజులు వర్ష సూచన, ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









