IMF Big Shock To Pakistan: కఠినమైన షరతులు విధించడమే కాకుండా భారత్‌తో అనవసరమైన ఉద్రిక్తతలు పెంచుకుంటే పాక్‌కే నష్టమని ఐఎంఎఫ్ సూటిగా చెప్పింది. ఈ ఘర్షణలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారుస్తాయని.. సంస్కరణల లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. ఒకవైపు ఆర్థికంగా చితికిపోతున్న దేశం.. మరోవైపు పొరుగు భారతదేశంతో కయ్యానికి కాలు దువ్వితే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. నిజానికి భారత్‌తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసినప్పటికీ ప్రస్తుతం కొంత స్థిరత్వం కనిపిస్తోందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. అయితే మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.
Also Read: IPL 2025 PBKS vs RR: హ్యాట్రిక్ విజయంతో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు.. రాజస్థాన్ కథ కంచికి
ఐఎంఎఫ్ పాకిస్థాన్‌పై మరో కొత్త షరతు విధించింది. జూన్ 2025 చివరి నాటికి తమ కార్యక్రమ లక్ష్యాలను చేరుకోవడానికి అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు పార్లమెంటరీ ఆమోదం పొందాలని ఆదేశించింది. అంతేకాకుండా అభివృద్ధి వ్యయం కోసం 1.07 ట్రిలియన్ రూపాయలతో సహా, మొత్తం ఫెడరల్ బడ్జెట్ పరిమాణాన్ని 17.6 ట్రిలియన్ రూపాయలుగా చూపాలని స్పష్టం చేసింది. మరోవైపు, పాకిస్థాన్ తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచాలని చూస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2.414 ట్రిలియన్ రూపాయలు కేటాయించాలని యోచిస్తోంది. ఇది ప్రస్తుత బడ్జెట్ కంటే 12 శాతం ఎక్కువ. అయితే ఈ నెల ప్రారంభంలో భారత్‌తో ఘర్షణ తర్వాత ప్రభుత్వం ఏకంగా 18 శాతం ఎక్కువ కేటాయించాలని భావించింది.
Also Read: Liquor Price Hike: మందుబాబులకు భారీ దెబ్బ.. తెలంగాణలో లిక్కర్‌పై భారీగా ధరల పెంపు
ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఐఎంఎఫ్ ఇస్తున్న నిధులను పాకిస్థాన్ అభివృద్ధికి ఉపయోగించకుండా ఉగ్రవాదులను పోషించడానికి వాడుకుంటోందని భారత్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పాక్ ప్రభుత్వం రూ.14 కోట్లు ఇస్తోందని సంచలన విషయాలు వెల్లడించింది. పాకిస్థాన్‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లేనని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాక్‌కు నిధులు సమకూర్చే విషయంలో పునరాలోచించాలని ఐఎంఎఫ్‌ని కోరింది.
అయినప్పటికీ ఐఎంఎఫ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్‌ఎఫ్) కింద పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేసింది. ఆర్థికంగా కునారిల్లుతున్న పాక్‌కు ఇది కాస్త ఊరటనిచ్చినా.. నెరవేర్చాల్సిన షరతులు మాత్రం కొండంత ఉన్నాయి. మరి ఈ షరతుల కొండను పాకిస్థాన్ ఎలా అధిగమిస్తుందో చూడాలి. అలాగే, భారత్‌తో వైరాన్ని వీడి ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తుందో లేదో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter