Groom forces to marry mother instead of daughter in meerut: ఇటీవల కాలంలో యువతీ, యువకులు పెళ్లిళ్లు చేసుకొవడానికి అస్సలు ఆసక్తి చూపించడంలేదు. మొత్తంగా మరికొన్ని చోట్ల ఎన్నో అబద్దాలు ఆడి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. జాబ్ విషయంలో, ప్యాకేజీల విషయంలో రకరకాల అబద్దాలు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇంకా కొంత మంది ఫోటో ఒకటి చూపించి మరోకరితో పెళ్లిళ్లు సైతం జరిపిస్తున్నారు.
ఈ క్రమంలో సాధారణంగా ముస్లిం కమ్యునిటీలో పెళ్లిళ్లు చాలా వెరైటీగా జరుగుతాయి. అక్కడ పెళ్లిని మౌల్వీ జరిపిస్తాడు. నిఖా అయ్యే వరకు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొరు.ఈ క్రమంలో ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించి అనేక వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికూ కాబోయే అల్లుడితో అత్త జంప్ కావడం, అదే విధంగా కూతురు మామతో తల్లి ఎఫైర్ పెట్టుకొవడం , భర్తల్ని భార్యల్ని చంపడం వంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. మేరఠ్ లో జరిగిన మరో పెళ్లి ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని మేరఠ్ లో ఇటీవల ఒక పెళ్లి వేడుకు జరిగింది. అయితే.. . బ్రహ్మపురికి చెందిన మొహమ్మద్ అజీం(22)కు, శామలీ జిల్లాకు చెందిన మంతశా(21)తో వివాహం ఖరారైంది. పెళ్లి రోజు రానే వచ్చింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం.. మౌల్వీ వీరి పెళ్లిని జరిపిస్తున్నాడు. ఇంతలో అతను.. వధువు పేరును తాహిరాగా ప్రకటించడంతో అజీంకు అనుమానం కలిగింది.
వెంటనే.. ముసుగు తొలగించి చూసిన అతడు ఖంగు తిన్నాడు. వధువు స్థానంలో మంతశా కాకుండా ఆమె తల్లి కూర్చుని ఉంది. అప్పటికే ఆమె భర్త చనిపోయాడు. దీంతో అతను సీరియస్ అయ్యాడు. అక్కడి వాళ్లతో గొడవకు దిగాడు. అయితే.. దీనిపై ప్రశ్నించగా..వధువు మోసం గురించి ప్రశ్నించగా.. రివర్స్ లో కేసు పెడతామని అతడ్ని బెదిరించారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఘటనలో.. అజీం తరపున పెద్దలుగా వ్యవహరించిన అతడి అన్న, వదిన వధువు కుటుంబంతో కలిసి ఈ కుట్రలో పాల్గొన్నట్లు తెలిసింది. వెంటనే అజీం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా.. దగ్గరలోని పీఎస్ కు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అజీం దాదాపు రూ.5 లక్షలను పెళ్లి కోసం ఖర్చు చేసినట్లు తెలిపాడు. తాను పూర్తిగా మోసపోయానని, తన కుటుంబ సభ్యులతో సహా వధువు కుటుంబం కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు అతడు ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









