)
Bihar Assembly Election 2025 Phase 1 : దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా నాల్గో అతిపెద్ద రాష్ట్రం బిహార్. ఇక్కడి ఎన్నికల ఫలితాలను దేశ రాజకీయాలను దశా, దిశను నిర్ధేశించనున్నాయి. ఈ ఎన్నికలు ఎన్డీయే, మహాగట్బంధన్ కూటమిలకు కీలకం కానుంది. గత నెల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల హీట్ పెరిగింది. తాజాగా ఉదయం 7 గంటల నుంచి 121 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరుపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జేడీయూ నేత నితీష్ కుమార్, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్ తమ ఎన్నికల ప్రచారంలో అప్పటి లాలూ హాయంలో జరిగిన చీకటి పాలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అప్పటి చీకటి పాలన కావాలా.. వెలుగులు నింపే ఎన్డీయే పాలన కావాలని ఓటర్లను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మహాగట్బంధన్ తరుపున తేజస్వీ యాదవ్ అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వ పాలను దుమ్మెత్తి పోస్తున్నారు. నితిష్ కు ఏజ్ అయిపోయింది. యువతకు అవకాశం ఇవ్వాలని తనకు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వండని ఓటర్ల దగ్గరకు వెళుతున్నాడు.
బిహార్ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్ పార్టీ’ ఎవరి ఓట్లను చీల్చనుందో అని ఆయా కూటములకు చెందిన నేతలు భయపెడుతున్నారు. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక మిగిలిన స్థానాల్లో ఎల్ జేపీ 29 సీట్లు.. హిందూస్థాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా చెరో 6 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ రెండో సరిసమానమైన పాత్ర పోషిస్తుంటే.. ఇండియా కూటమికి మహా గట్ బంధన్ లో ఆర్జేడీ 143 మందితో అభ్యర్ధులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీకి చేస్తోంది. సీపీఐ తొమ్మది.. సీపీఎం (ఎం) నాలుగు స్థానాల్లో బరిలో ఉంది. దులో కొన్ని స్థానాల్లో మహాగట్ బంధన్ కూటమి ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తున్నారు.
మొదటి విడతలో ఆర్జీడీ అత్యధికంగా 72 స్థానాలు.. జేడీయూ 57 స్థానాలు.. బీజేపీ.. 48 స్థానాలు.. కాంగ్రెస్ ..24 స్థానాలు.. ఎల్ జేపీ --13 స్థానాల్లో పోటీలో ఉన్నాయి.బిహార్ లోని కోసీ, ముంగేర్, మిథిలాంచల్ ప్రాంతాల్లోని 18 జిల్లాల్లోని 121 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. విడతలోనే సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో ఎలక్షన్స్ పై అందరి నజర్ ఉంది.
ఇక గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తే 43 స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో విజయం తర్వాత ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని చేపట్టింది. ఇక 2022లో నితీష్ కుమార్.. బీజేపీకి ఝలక్ ఇచ్చి .. ఆర్జీడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. ఇక సెంటర్ లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయేకలో జేడీయూ కీలక పార్టనర్ గా ఉన్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది చూడాలి. మరోవైపు ఈ నెల 11న రెండో విడతలో 122 స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం బిహార్ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఈ నెల 14 బిహార్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.