)
Bihar Assembly Polls First Phase: బిహార్ ఎన్నికలు ప్రస్తుతం దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతో నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రధానంగా బరిలో ఉన్నాయి. ఇక ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్ పార్టీ’ నామ్ కే వాస్తేగా తయారైంది. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక మిగిలిన స్థానాల్లో ఎల్ జేపీ 29 సీట్లు.. హిందూస్థాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా చెరో 6 స్థానాల్లో బరిలో దిగుతున్నాయి. ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ రెండో సరిసమానమైన పాత్ర పోషిస్తుంటే.. ఇండియా కూటమికి మహా గట్ బంధన్ లో ఆర్జేడీ 143 మందితో అభ్యర్ధులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీకి దిగింది. సీపీఐ తొమ్మది.. సీపీఎం (ఎం) నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో కొన్ని స్థానాల్లో మహాగట్ బంధన్ కూటమి ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తున్నారు.
మొదటి దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో మూగపోనుంది. మొత్తంగా బిహార్ లోని కోసీ, ముంగేర్, మిథిలాంచల్ ప్రాంతాల్లోని 18 జిల్లాల్లోని 121 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలోనే సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ 6 స్థానాలకు గాను ఎన్డీయే 5, మహా గట్ బంధన్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ సారి నితీశ్ కుమార్ ఇమేజ్ తో మరోసారి అక్కడ అభ్యర్ధులు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
ఇక గత బిహార్ శాసన సభ ఎలక్షన్స్ లో ఎన్టీయే కూటమిలో జేడీయూ 115 సీట్లలో పోటీ చేసిన 43 స్థానాలను కైవసం చేసుకుంది. అదే సమయంలో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసిన 74 స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో విజయం తర్వాత ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని చేపట్టింది. ఇక 2022లో నితీష్ కుమార్.. బీజేపీకి జెల్లకొట్టి .. ఆర్జీడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే పక్షంలో చేరాడు. ఇక కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయేకలో జేడీయూ కీలక భాగస్వామిగా ఉన్నాడు.
ముఖ్యంగా 2013లో ప్రధాని మోడీ రాక ముందు బిహార్ లో 52 శాతమే ఎలక్ట్రిసిటీ కవరేజ్ ఉండేది. 2025లో 100 శాతం ఎలక్ట్రిసిటీ సాధించింది. రోడ్డ్ లెంగ్త్ విషయానికొస్తే.. 1.64 లక్షల కిలోమీటర్ల నుంచి 2025లో 2.98 లక్షల కిలో మీటర్ల కవరేజ్ అయింది. జీడీపీ 2013లో రూ. 2.82 లక్షల కోట్లు ఉంటే.. 2025 రూ.10.97 లక్షల కోట్లకు చేరింది. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు.. 2013లో 41 లక్షలు ఉంటే.. 2025లో 1.16 కోట్లకు చేరింది. పక్కా ఇళ్లు 2013లో 10 లక్షల ఇళ్లు ఉంగే.. 2025లో 38.4 లక్షలున్నాయని లెక్కలు చెబుతున్నారు.
మరోవైపు ఎన్టీయే కూటమికి మహిళా ఓటు బ్యాంక్.. ముఖ్యమంత్రి రోజ్ గార్ యోజన.. మహిళలకు వ్యాపారం చేసుకోవదానికి రూ. 10 సాయం వంటి ఎన్డీయే కూటమికి కలిసొచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రులైన చిరాగ్ పాశ్వాన్ కు చెందిన ఎల్ జేపీ, ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన ఆర్ ఎల్ ఎం పార్టీలు ఎన్డీయే చేరడంతో దళితులు, ఓబీసీల్లో ఎన్డీయే కూటమి బలం పెరిగింది. మొత్తంగా ఈ నెల 6న జరిగే మొదటి విడతలో ఎవరు పై చేయి సాధిస్తారనేది చూడాలి. మొదటి విడతలో ఆర్జీడీ అత్యధికంగా 72 స్థానాల్లో బరిలో ఉంది. జేడీయూ 57 స్థానాలు.. బీజేపీ.. 48 స్థానాలు.. కాంగ్రెస్ ..24 స్థానాలు.. ఎల్ జేపీ --13 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇందులో ఎవరు ఎక్కవ స్థానాలు గెలుచుకుంటారనేది చూడాలి. ఈ నెల 11న రెండో విడతలో 122 స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం బిహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 14 శుక్రవారం బిహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook