)
Bihar Assembly Election 2025 Phase 1: బిహార్ శాసనసభకు జరగుతున్న ఎన్నికల్లో అధికార ఎన్డీయే తోపాటు విపక్ష కూటమి అయిన మహాగట్ బంధన్ ఈ సారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో తమ కూటమే రాబోతుందని ఎవరి లెక్కలు వారు వేసుకుంటారు. మొదటి విడత జరిగే ఎన్నికల్లో మిథిలాంచల్, కోసి, ముంగేర్ డివిజన్లలోని 18 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఎవరి భవిష్యత్తును ఎలా ఉండబోతుందనేది ఓటర్లు తేల్చనున్నారు. ఈ దశలో పోటీపడుతున్న ముఖ్య నాయకులలో ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్, బీజేపీ నాయకులు సామ్రాట్ చౌదరి, మంగళ్ పాండే, జేడీయూ నాయకులు శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్ చౌదరి, తేజ ప్రతాప్ యాదవ్ వంటివారు ఉన్నారు. ఇక తేజస్వీ యాదవ్.. రఘోపూర్ నుంచి బరిలో ఉన్నారు.
మొదటి విడత జరిగే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ, మహా ఘట్బంధన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోలింగ్ 18 జిల్లాల్లో జరుగుతోంది. వీటిలో పాట్నా, వైశాలి, దర్భంగా, ముంగేర్, తరపూర్, మహువా, అలీనగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. పట్నా డివిజన్, మగధ్, తిరుత్, షాహాబాద్ ప్రాంతాలు కవర్ అవుతాయి. మొత్తం 7.42 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు. కొత్తగా 10.72 లక్షల మంది ఓటర్లు చేరారు, 7.78 లక్షల మంది 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఓటర్లు ఉన్నారు.
2020 ఎన్నికల్లో ఎన్డీయే 121 సీట్లకు గాను 70 సీట్లను గెలుచుకుంది. అప్పటితో పోలిస్తే తాము 17 నుంచి 19 సీట్లు అదనంగా ఈసారి గెలుస్తామని ఎన్డీయే కూటమిగా ధీమా చెబుతోంది. మహాగట్ బంధన్‌కు 2020తో పోలిస్తే 19 నుంచి 21 సీట్లు తగ్గుతాయని అంటోంది. గత ఎన్నికల్లోనూ ఈ ప్రాంతాల్లో ఎన్డీయే ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఆర్జేడీ కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఎవరి ఓట్లను చీల్చుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన సాధించే ఓట్లు ఎవరి పుట్టి ముంచుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.