Bihar Election Result 2025: మహిళల ఖాతాల్లోకి రూ.10,000..కాంగ్రెస్ కొంపముంచిన ఒక్క పథకం..ఫలితాలు చూసి ఖంగుతిన్న రాహుల్ గాంధీ!

Bihar 10000 To Women Scheme: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షలైన ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 67.13% ఓటింగ్ జరగ్గా.. 1951 తర్వాత బిహార్‌లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం. అయితే మహిళల ఓటింగ్‌ ఎన్డీఏ విజయానికి ప్రధాన కారణంగా మారాయి.

Written by - Harish Darla | Last Updated : Nov 14, 2025, 03:50 PM IST
Bihar Election Result 2025: మహిళల ఖాతాల్లోకి రూ.10,000..కాంగ్రెస్ కొంపముంచిన ఒక్క పథకం..ఫలితాలు చూసి ఖంగుతిన్న రాహుల్ గాంధీ!

Bihar 10000 To Women Scheme: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షలైన ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 67.13% ఓటింగ్ జరగ్గా.. 1951 తర్వాత బిహార్‌లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం. అయితే ఇంతటి ఓటింగ్ కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎక్కువగా ఉంటూ ఈసారి ఎలాగానే ప్రభుత్వం మారుతుందని అంతా అనుకున్నారు. 

Add Zee News as a Preferred Source

NDA కూటమికి సంపూర్ణ మెజారిటీ..
కానీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఆ అంచనా తారుమారు అయ్యింది. ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన డేటా ప్రకారం.. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ బీజేపీ 95, జనతా దళ్ 84,  రాష్ట్రీయ్ జనతా దళ్ 24, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) 20, కాంగ్రెస్ 4, బహుజన్ సమజ్ పార్టీ కేవలం ఒకే సీటును గెలుచుకుంది.  అయితే బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలకు గానూ ఎన్డీఏ కూటమి 208 సీట్లను గెలుచుకుంది. దీంతో బిహార్‌లో కూటమి మరోసారి ప్రభుత్వాన్ని నిర్మించనుంది. 

Also Read: Bihar Election Result 2025: అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్..ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ..ప్రశాంత్‌ కిషోర్‌ను దెబ్బకొట్టిన జనాలు!

మహిళల ఓట్లు కీలకంగా..
తాజాగా వెలువడిన ఫలితాలను బట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు ఎక్కువ పోలవ్వలేదని తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ మీడియా, ఇతర సర్వేలు ఎన్డీఏ కూటమి విజయాన్ని అంచనా వేశాయి. అంతని విజయానికి బిహార్ లోని 71.6 శాతంగా ఉన్న మహిళల ఓట్లే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు సహకరించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఎన్డీఏ కూటమికి బెనిఫిట్‌గా మారిందని తెలుస్తోంది. 

రూ.10 వేలతో చేయగలిగే పని..
నితీష్ కుమార్ మహిళల ఓట్లను ఎక్కువగా చూరగొనడానికి కారణం.. ఎన్నికల ముందు మహిళల ఖాతాల్లో రూ.10,000 జమ చేయడమే అందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు మహిళలకు సైకిళ్ల పంపిణీ.. మద్యపాన నిషేధం తీసుకురావడంతో పాటు శాంతిభద్రతలను నెలకొల్పడంలో సీఎం నితీష్ కుమార్ విజయం సాధించడం పట్ల అతడిపై మహిళల ఆదరణ పెరిగిందని.. అది ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిందని తెలుస్తోంది. 

దీంతో పాటు నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలపై బిహార్ ప్రజల్లో ఉన్న బలమైన నమ్మకం.. రాష్ట్రీయ జనతా దళ్ తేజస్వి యాదవ్‌కు గట్టి దెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా రాష్ట్రీయ జనతాదళ్ ప్రస్తుతం 40 కంటే ఆధిక్యంలో ఉంది. అయితే మహిళలకు రూ. 30,000 ఇస్తామని తేజస్వి యాదవ్ ప్రకటించినా.. అప్పటికే మొదటి దశ పోలింగ్ ముగియడం వల్ల ఆ వాగ్ధానం నీరు గారిపోయినట్లు తెలుస్తోంది. 

Also REad: Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News