Bihar Election Result 2025: 2025లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. బిహార్ లో నరేంద్ర మోడీ, నితిష్ కుమార్ కాంబో (నిమో) కాంబినేషన్ సూపర్ హిట్టైయింది. మరోసారి బిహార్ ప్రజలు ఎన్డీయే కూటమే విజయం కట్టబెట్టారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎన్డీయే గెలవడానికి సోషల్ ఇంజనీరింగ్ కూడా బాగా పనిచేసింది. బిహార్ లో జేడీయూకు సాంప్రదాయంగా వస్తోన్న కుర్మీ ఓట్లతో పాటు బీజేపీ అండగా ఉన్న బ్రాహ్మణ్, బనియా, భూమిహార్ లతో పాటు యాదవేతర ఓబీసీలు ఓట్లు గంపగుత్తగా కూటమి వైపు మళ్లాయి. అటు ఎల్జేపీ వల్ల దళితులు ఓట్లు.. హిందూస్థాన్ అవామీ మోర్చా వల్ల బిహార్ లో మహా దళితుల ఓట్లలో మెజారిటీ ఓట్లు ఎన్డీయే వైపు మొగ్గు చూపినట్టు ఫలితల సరళిని చూస్తే తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల ముందు నితీష్ కుమార్ .. మహిళల స్వావలంభన వారి అకౌంట్లలో వేసిన డబ్బులతో పాటు యేడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ పథకాలు కూడా బీజేపీ,జేడీయూ గెలుపుకు దోహదం చేశాయి. పైగా ఎన్నికలకు వారం రోజుల నుంచి ప్రధాన మంత్రి సుడిగాలి పర్యటనతో మొత్తంగా ఓటర్లను ఎన్డీయే కూటమి వైపు మళ్లించడంలో విజయం సాధించారు.
ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలోని జంగిల్ రాజ్ పాలనను.. నితీష్ కుమార్ పాలనతో కంపేర్ చేస్తే.. అపుడు బిహార్ ఎలా ఉంది.. ఇపుడు బిహార్ ఎలా ఉందనే దానిపై పోలిక తెస్తూ ఇప్పటి యూత్ ఓటర్లను తన వైపు తిప్పుకున్నారు. మరోవైపు హిందుత్వ అంశాలు.. నరేంద్ర మోడీ ఇమేజ్ కలిసొచ్చి బిహార్ లో మరోసారి బీజేపీ, జేడీయూ కూటమికి ప్రజలు అధికారం కట్టబెడుతున్నారు.
ప్రస్తుతం బిహార్ లో ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్ 122 దాటి 188 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. బీజేపీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అతిపెద్ద పార్టీగా తొలిసారి అవతరించబోతుంది. జేడీయూ 73 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎల్జేపీ 23 స్థానాలు.. హిందూస్థాన్ అవామీ మోర్చ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. లోక్ జనశక్తి (రాంవిలాస్ పాశ్వాన్) -28 స్థానాలు.. హిందూస్థాన్ అవామ్ మోర్చా (HAM)-6, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)-6 స్థానాల్లో పోటీ చేశాయి. అందులో లోక్ జనశక్తి పార్టీ ఓ అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణకు గురైంది.
మహా గఠ్ బంధన్ తరుపు ఆర్జేడీ 143 స్థానాలు.. కాంగ్రెస్ 61 స్థానాలు.. సీపీఐ (ఎంఎల్) 20 స్థానాలు.. వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ 12.. సీపీఎం 4 .. ఇండియన్ ఇన్ క్లూజివ్ పార్టీ -3, జనశక్తి జనతాదళ్ -1 పోటీకి దిగాయి.
Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!
Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









