)
Bihar Assembly Elections: దేశవ్యాప్తంగా అందరి చూపు బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారిన బిహార్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠగా ఉన్నాయి. ఓటర్ల ఏరివేతపై తీవ్ర దుమారం రేపగా.. ఎట్టకేలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది.
న్యూఢిల్లీలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కూడా ఈసీ విడుదల చేసింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం రెండు దశల్లో పోలింగ్ జరుగుతుందని.. నవంబర్ 6, 11వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. అనంతరం 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
బిహార్‌లో మొత్తం ఓటర్లు 7.42 కోట్లు ఉన్నారని ఈసీ తెలిపింది. జూన్ 24వ తేదీ నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించి.. ఆగస్టు 1వ తేదీన తుది జాబితా ప్రకటించినట్లు కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల కంటే 10 రోజుల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బిహార్‌లోని మొత్తం 243 స్థానాలకు నవంబర్ 22వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ఈసీ వెల్లడించింది. బిహార్ అసెంబ్లీకి నవంబర్ 22వ తేదీన గడువు ముగియనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.