Maha kumbh: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఘోరం.. డ్రాపింగ్ పేరుతో యువతిపై బైక్ రైడర్ అత్యాచారం..

Biker raped girl in prayag raj: బైకర్ యువతిని ప్రయాగ్ రాజ్ సంగమ్ కు తీసుకెళ్తానని చెప్పిన తన బైక్ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 23, 2025, 05:52 PM IST
  • కుంభమేళలో యువతిపై అత్యాచారం..
  • సీరియస్ అయిన యూపీ పోలీసులు..
Maha kumbh: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఘోరం.. డ్రాపింగ్ పేరుతో యువతిపై బైక్ రైడర్ అత్యాచారం..

Biker raped girl in maha kumbhmela: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళకు భక్తులు భారీగా వస్తునే ఉన్నారు. ఫిబ్రవరి 26 తో కుంభమేళ ముగియనుంది. ఈ క్రమంలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఎలాగైన 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిరోజు కూడా భక్తులు కుండపోతగా వస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళలో ఎక్కడ చూసిన కూడా భక్తులు భారీగా కన్పిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

అయితే.. కుంభమేళలో వస్తున్న భక్తులు రద్దీని బట్టి అధికారులు సిటీకీ అవతల ప్రైవేటు వాహానాల్ని నిలిపివేస్తున్నారు. దీంతో భక్తులను స్థానిక బైకర్ లను తమ టూవీలర్ ల మీద సంగం దగ్గరకు తీసుకెళ్లి డ్రాప్ చేస్తున్నారు. దీనికోసం టూవీలర్ వాళ్లు చాలా ఎక్కువగానే చార్జీ చేస్తున్నారు. మొత్తంగా ప్రయాగ్ రాజ్ కుంభమేళ ప్రస్తుతం దేశంలో గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం ముగియడానికి వస్తుండటంతో మరింత భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివస్తున్నారు.

ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ లో ఒక యువతిని బైకర్ సంగం వద్దకు తీసుకెళ్తానని చెప్పి ఆమెను బైక్ మీద ఎక్కించుకున్నాడు. ఆతర్వాత సీక్రెట్ ప్రదేశాల గుండా తింపుతు... ఆమెకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేటుగాడి పశుబలం ముందు యువతి ఎంతగా ప్రతిఘటించిన లాభంలేకుండా పోయింది.  ఈ ఘటన ప్రయాగ్ రాజ్ సమీపంలోని చుంగీ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు సమాచారం.

Read more: Maha Kumbh: ఇంతకన్నా ఘోరం మరోకటి ఉంటదా..?.. కుంభమేళకు వెళ్తు కన్న తల్లిని ఇంట్లో తాళం పెట్టి... వీడియో వైరల్..

ఈ ఘటనపై యువతి సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసుకుని,  రంగంలోకి దిగిన పోలీసులు యువతిని అత్యాచారంచేసిన బైకర్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ ఘటన ప్రస్తుతం దుమారంగా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. తొందరలోనే నిందితుడ్ని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఘటన ప్రదేశంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు జల్లెడపడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News