వీడియో: ప్రభుత్వ ఉద్యోగికి 100 గుంజీల శిక్ష విధించిన ఎమ్మెల్యే

ఒడిషాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఓ యువ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారి చేత ప్రజలందరి ముందే 100 గుంజీలు తీయించిన ఘటన, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Last Updated : Jun 7, 2019, 01:48 PM IST
వీడియో: ప్రభుత్వ ఉద్యోగికి 100 గుంజీల శిక్ష విధించిన ఎమ్మెల్యే

భువనేశ్వర్: ఒడిషాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఓ యువ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారి చేత ప్రజలందరి ముందే 100 గుంజీలు తీయించిన ఘటన, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిజూ జనతా దళ్ పార్టీ తరపున పాట్నాగఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ కుమార్ మెహెర్.. ఎన్నికల్లో గెలుపు అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్ర స్థాయిలో పర్యటన సందర్భంగా ఆయన పలు గ్రామాలకు వెళ్లి అక్కడి అభివృద్ధి, మౌళిక వసతులు, సమస్యలపై ఆరాతీసే ప్రయత్నం చేశారు.

 

ఈ క్రమంలోనే రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని తెలుసుకున్న ఎమ్మెల్యే సరోజ్ కుమార్.. వెంటనే పబ్లిక్ వర్క్స్ విభాగానికి సంబంధించిన జూనియర్ ఇంజినీర్‌పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అంతటితో ఎమ్మెల్యే ఆగ్రహం చల్లారలేదు. రహదారుల నాణ్యతను పరిశీలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు శిక్షగా ఆ గ్రామ ప్రజల ముందే సదరు ప్రభుత్వ ఉద్యోగిని 100 గుంజీలు తీయించడంతోపాటు, అక్కడికక్కడే గ్రామస్థులకు క్షమాపణ చెప్పించారు.

 

Trending News