)
BJP National President elections: గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఓ కొలిక్కి రానుంది. ఈ పాటికే నేషనల్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవాల్సి ఉండగా.. మధ్యలో ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కడ్ రాజీనామాతో ఏర్పడిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వల్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నిక ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా సెప్టెంబర్ 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ సారి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తరుపున తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల తరుపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిద్దరు దక్షిణ భారత దేశానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే సంఖ్యా బలం నేపథ్యంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనమే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే ఈ సారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా దక్షిణాది నుంచి అందులో ఓ మహిళ జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. బీజేపీ దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలకు అధ్యక్ష ఎన్నికలు పూర్తి చేసిన నేపథ్యంలో జాతీయ అధ్యక్ష పదవిని భర్తీ ఒకటే మిగిలి ఉంది. ఏప్రిల్ నెలాఖారులో దీన్ని భర్తీ చేయాల్సి ఉన్నా.. పహల్గామ్ ఉగ్రదాడి ఆపై ఆపరేషన్ సింధూర్ మూలంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవడంలో కాస్త ఆలస్యమైంది. కానీ ఈ సారి జాతీయ అధ్యక్ష బాధ్యతలను ఓ మహిళకు అప్పగించాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ పోస్టును ఈసారి ఓ మహిళా నేతకు అప్పగించేందుకు పలువురు మహిళా లీడర్ల పేర్లను హైకమాండ్ పరిశీలించింది. ఇప్పటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఒక్క మహిళ నేత పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి మహిళను నేషనల్ ప్రెసిడెంట్ గా నియమించాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జగత్ ప్రకాష్ నడ్డా పదవీకాలం ముగిసింది. కానీ పలు కారణాల రీత్యా ఆయన్ను కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా రాజ్యసభ లీడర్ గా ఉన్నారు. అయితే జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ మాజీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే బీజేపీ అధిష్ఠానం ఎపుడు ఎవరి అంచనాలకు అందవు. అలా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మహిళను నియమిస్తారా.. లేకపోతే.. మళ్లీ పురుషులకే కట్టబెడతారా. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నేతల్లో ఎవరో ఒకరికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా ? అనూహ్యంగా తెరపై కొత్తవారిని తీసుకొస్తారా అనేది వెయిట్ అండ్ సీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.