BJP National President: ఈ నెలలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన.. మరో రెండు రోజుల్లో తెలంగాణకు కొత్త బీజేపీ చీఫ్..!

BJP National President: గత కొన్నేళ్లుగా బీజేపీ జాతీయ అధ్మక్షుడి ప్రకటన ఆలస్యమవుతూ వస్తోంది. లాస్ట్ ఇయర్ బీజేపీకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉన్నా.. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ సహా మరో 6 రాష్ట్రాలకు ఈ నెలాఖరులోకగా కొత్త అధ్యక్షులను ప్రకటించబోతున్నట్టు బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 17, 2025, 02:45 PM IST
BJP National President: ఈ నెలలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన.. మరో రెండు రోజుల్లో తెలంగాణకు కొత్త బీజేపీ చీఫ్..!

BJP National President: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతూ వస్తోంది. ఇదిగో.. అదిగో అంటూ ప్రకటనలకే పరిమితమైంది. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన కూడా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉండబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నెలాఖరులోకా మిగిలిన 6 రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడి ఎన్నికను పూర్తి చేయనుంది. ముందుగా పెండింగ్ లో ఉన్న 6 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించనున్నారు. ఆ తర్వాత అందరు కలిసి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటిలో పార్టీ అగ్రనేతలైన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జగత్ ప్రకాష్ నడ్డా తో పలువురు నేతలు భేటి అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్నాటక, పుదుచ్చేరి అధ్యక్షులను ప్రకటించనున్నారు.  

Add Zee News as a Preferred Source

అయితే.. ఇప్పటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఒక్క మహిళ కూడా పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి మహిళను జాతీయ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన మాజీ సీఎం వసుంధరా రాజేతో పాటు స్మృతి ఇరానీ, పురంధేశ్వరి పేర్లు జాతీయ అధ్యక్షురాలి రేసులో వినిపిస్తున్నాయి. ఒక వేళ దక్షిణాది, మహిళ కోటాలో పురంధేశ్వరికి ఇస్తారా అనేది చూడాలి. లేకపోతే.. అన్నామలై, కిషన్ రెడ్డితో పాటు భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్  పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. వీళ్లు కాకుండా మరెవరికైనా జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అనేది చూడాలి.

ఇక తెలంగాణ నూతన అధ్యక్షుడి ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు డీకే పేరు కూడా వినిపిస్తోంది. వీళ్లిద్దరు కాకపోతే.. ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా బీజేపీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లను ఎన్నిక చేస్తూ వస్తోంది.

ఈ రకంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ముందు నుంచి పార్టీలో లేని వాళ్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. రీసెంట్ గా కేరళలో కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేని రాజీవ్ చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. గతంలో అస్సాం కాంగ్రెస్ నేతగా ఉన్న హిమంత్ బిశ్వ శర్మను ఏకంగా సీఎం పీఠంపై కూర్చొబెట్టింది.  అటు కర్ణాటకలో కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మైను సీఎంను  చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్ఎస్ఎస్ నేపథ్యంలేని నేతను బీజేపీ అధ్యక్షుడిగా నియమించవచ్చని చెబుతున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News