Telangana New BJP Chief N Ramachadra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో హైకమాండ్ ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. దాంతో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారు అని జరిగిన ప్రచారానికి తెరదించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చిన ఈటెలకు తెలంగాణ బిజెపి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడిగా నామినేషన్ ఈ రోజు మధ్నాహ్నం దాఖలు చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు ఎంపికతో సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కే.లక్ష్మణ్ వంటి పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో ఆర్ ఎస్ ఎస్ అండదండలు ఉన్న ఎన్. రామచంద్రరావును బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొవడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఈటలపై కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి అంశాలు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అగ్ర వర్గణ పార్టీగా పేరు ఉంది. ఇపుడిపుడే ఆ ముద్ర చెరిపేసుకుంటుంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా గా తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్న ఎన్. రామచంద్రరావు ఏ ప్రాతిపదికన ఎంపిక చేసారనేది అందరు చర్చించుకుంటున్నారు. కేవలం పార్టీ విధేయత, ఆర్ఎస్ఎస్ అండదండలు, మొదటి నుంచి పార్టీలో ఉండటం వంటివి రామచంద్రరావుకు కలిసొచ్చిన అంశాలు. ఎపుడు పార్టీ లక్ష్మణ రేఖను దాటకపోవడం.. మొన్నటి ఎన్నికల్లో మల్కాజ్ గిరి టికెట్ ఆయనకు నిరాకరించినా.. ఈటెలకు అనుకూలంగా ప్రచారం చేయడం వంటివి ఆయనకు సానుకూలంగా మారాయి. పైగా క్రిమినల్, సివిల్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న లాయర్ గా ఎలాంటి అంశాల్లో అయిన ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ను ఎదుర్కొవడంలో ఆయన సలహాలు, సూచనలు పార్టీకి ఉపయోగపడనున్నాయి.
ఎన్.రామచంద్రరావు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. అంతేకాదు మల్కాజ్ గిరి ఎంపీగా రెండు సార్లు బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. అంతేకాదు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా పోటీ చేసారు. పైగా ఈటల వంటి బయట నుంచి వచ్చినవారిని కాకుండా.. పార్టీలో ఉన్న సీనియర్స్ ఈటలకు చెక్ పెట్టేలా రామచంద్రరావు పేరును ముందు పెట్టినట్టు తెలుస్తుంది.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









