)
Jammu Kashmir Rajya Sabha Elections: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత గతేడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ జమ్మూ కశ్మీర్ లో ఓట్ల శాతం పరంగా బీజేపీ ముందు వరుసలో నిలిచింది. అంతేకాదు కేవలం జమ్మూ కశ్మీర్ లో కేవలం జమ్మూ రీజియన్ లోనే ఏకంగా 27 సీట్లు గెలిచి సంచలనం రేపింది. అయితే జమ్మూ శ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ.. తాజాగా అక్కడ జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓ సీటు గెలిచి అందనిని అవాక్కయ్యేలా చేసింది. జమ్మూ కశ్మీర్ లో రాజ్యసభ సీటు గెలిచినంత మాత్రానా.. బీజేపీ ఏమైనా తోపు అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు కిటుకు. రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల శాసన సభ సభ్యులు ఎన్నుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థానానికి సంబంధించిన ఎన్ని ఓట్లు ఉండాలనే ఓ లెక్క ఉంటుంది. ఇది ఒక్కో రాష్ట్రంతో పాటు జనభా నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఈ లెక్క మారుతూ ఉంటుంది.
ఇక నిజానికి జమ్మూ కశ్మీర్ నుంచి ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి రాజ్యసభ సభ్యుడు కావాలంటే 32 ఓట్లు ఉండాలి. కానీ బీజేపీకి అక్కడ ఉంది కేవలం 27 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కానీ అదనంగా 5 ఓట్లు పడటంతో అక్కడ ఓ రాజ్యసభ సీటును కైవసం చేసుకుంది. అయితే ఈ సీటు గెలవడం వెనక ఎవరు నేషనల్ కాన్ఫిరెన్స్, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు క్రాస్ ఓటింగ్ చేసారనేది ఇపుడు ప్రశ్నార్ధంగా మారింది. అయితే ఈ సీటు గెలవడం వెనక అమిత్ షా వెనకాల ఉండి మొత్తం చక్రం తిప్పారు. జమ్మూ కశ్మీర్ లో ఉన్న రాజ్య సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒదులు కోకూడదనే కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ.. ముందు నుంచి పావులు కదిపి చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చి ఈ సీటను గెలుచుకుంది. అయితే జమ్మూ కశ్మీర్ లోని 4 రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో మూడు నేషనల్ కాన్ఫిరెన్స్, ఒకటి బీజేపి వశం అయ్యాయి. అయితే.. నాల్గో సీటును కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు నేషనల్ కాన్ఫిరెన్స్ ముందుకు వచ్చింది. కానీ అమిత్ షా ఎత్తుల ముందు కాంగ్రెస్ రాజకీయం చిత్తు చిత్తు అయింది.
ఈ ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇది సంచలనం అది ఎవరు చేసి ఉంటారు. నేషనల్ కాన్ఫిరెన్స్ వాళ్లు చేసారా.. ? కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చేసారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా పెద్దగా బలం లేని చోట కూడా ఎన్నికల్లో గెలిచి సత్తా చాటి జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో తన పట్టు నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనక ఉన్న అమిత్ షా వ్యూహాన్ని ఇపుడు ప్రతిపక్ష పార్టీలు సైతం మెచ్చుకుంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.